TS SSC మ్యాథ్స్ అంచనా పత్రం 2025 (TS SSC Mathematics Guess paper 2025) : తెలంగాణ పదో తరగతి గణిత పరీక్ష మార్చి 26, 2025న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. పేపర్ నమూనా ప్రకారం, TS SSC గణిత పరీక్ష 80 మార్కులకు నిర్వహించబడుతుంది. అభ్యర్థులకు పేపర్‌ను పరిష్కరించడానికి 3 గంటల సమయం లభిస్తుంది. TS SSC మ్యాథ్స్ పరీక్షకు హాజరయ్యే ముందు, అభ్యర్థులు సబ్జెక్టుల వారీగా మోడల్ పేపర్లను ఒకసారి చెక్ చేసుకోవాలి. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. తద్వారా అభ్యర్థులు ప్రశ్నల రకం, పేపర్ నమూనా, మార్కింగ్ స్కీమ్ మొదలైన వాటి గురించి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. విద్యార్థులు పరీక్షలో పార్ట్ A ప్రశ్నలకు సమాధానమివ్వడానికి, అభ్యర్థులు ప్రత్యేక సమాధాన పుస్తకాన్ని పొందుతారు, అయితే పార్ట్ B ప్రశ్నలకు ప్రశ్న బుక్‌లెట్‌లోనే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. దానిని పార్ట్ A సమాధాన పుస్తకంతో జతచేయాలి.
లేటేస్ట్ : తెలంగాణ పదో తరగతి మ్యాథ్స్ 2025 పరీక్షలో ఎక్కువగా వచ్చే ప్రశ్నలు
TS SSC మ్యాథ్స్ మోడల్ క్వశ్చన్ పేపర్ 2025 (TS SSC Mathematics Guess paper 2025)
విభాగాల వారీగా TS SSC మ్యాథ్స్ మోడల్ ప్రశ్నాపత్రాన్ని, ముఖ్యమైన ప్రశ్నలని 2025 ఇక్కడ అందించాం. ఈ దిగువున తెలిపిన లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ పదో తరగతి పరీక్ష ప్యాటర్న్ 2025 (TS SSC Exam Pattern 2025)
తెలంగాణ పదో తరగతి పరీక్షా విధానం గురించి 2025 (TS SSC Exam Pattern 2025) ఈ దిగువున అందించాం.
- TS SSC పరీక్షా సరళి 2025 గురించి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, హైదరాబాద్ (BSE తెలంగాణ) ప్రకటించింది.
- తెలంగాణ పదో తరగతి బ్లూప్రింట్ 2025 అన్ని భాషలు, కోర్సు సబ్జెక్టులకు కొత్త పరీక్షా సరళితో సబ్జెక్టుల వారీగా ప్రకటించడం జరిగింది.
- పదో తరగతి పరీక్షలు గతంలో 11 సబ్జెక్టులకు బదులుగా ఆరు సబ్జెక్టులకు నిర్వహించడం జరుగుతుంది.
- తెలంగాణ SSC ప్రశ్నాపత్రం 2025 100 మార్కులకు ఉంటుంది.
- ఈ 100 మార్కులలో, సంగ్రహణాత్మక మూల్యాంకనం (బోర్డు పరీక్ష) 80 మార్కులకు, నిర్మాణాత్మక పరీక్ష 20 మార్కులకు ఉంటుంది.
- ప్రతి పేపర్‌కు కనీస ఉత్తీర్ణత మార్కులు 35 మార్కులు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం
https://telugunews.collegedekho.com/ చూస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను ఇక్కడ పొందండి.