CollegeDekho
Trending searches

కాలేజ్‌దేఖో గురించి..


కాలేజ్‌దేఖో భారతదేశంలోని అతిపెద్ద ఉన్నత ఎడ్యుకేషన్ ఈకో సిస్టమ్. కాలేజ్‌దేఖోని రుచిర్ అరోరా (CEO & కో-ఫౌండర్), సౌరభ్ జైన్ (సహ-వ్యవస్థాపకుడు), రోహిత్ సాహా (సహ-వ్యవస్థాపకుడు)స్థాపించారు. కాలేజ్‌దేఖో ద్వారా ప్రతి విద్యార్థికి వారి నేపథ్యంతో సంబంధం లేకుండా కాలేజీల గురించి పూర్తి వివరాలు అందించడం, వారికి నచ్చిన కాలేజీల్లో చేరేందుకు పూర్తి గైడ్‌లైన్స్ ఇవ్వడమే లక్ష్యం. విద్యార్థుల కలలను సాకారం చేయడమే కాలేజ్‌దేఖో ధ్యేయంగా చెప్పుకోవచ్చు. నిజానికి మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో, నగరాల్లో మంచి మంచి కాలేజీలు ఉన్నాయి. కానీ వాటికి సంబంధించిన సమాచారం, వివరాల గురించి చాలామందికి తెలియదు. దాంతో విద్యార్థులు నాణ్యత గల విద్యను అందుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని కాలేజ్‌దేఖో అర్థం చేసుకుంది.పైగా భారతదేశం ఉన్నత విద్యలో స్థూల ఎన్‌రోల్‌మెంట్ నిష్పత్తి (GER) కేవలం 28.3% మాత్రమే ఉంది.దీంతో యువతీ, యువకులు సరైన కళాశాలకు చేరుకోవడంలో నిపుణులైన, సాంకేతికతతో కూడిన మార్గదర్శకత్వ అవసరాన్ని కాలేజ్‌దేఖో అర్థం చేసుకుంది. అందుకే మంచి మంచి కళాశాలలకు, విద్యార్థులకు వారధి మారింది.


కళాశాల ఆశావహుల ద్వారా దాదాపు 200 మిలియన్ల వెబ్‌సైట్ సెషన్‌లతో, భారతదేశంలోని దాదాపు 60 శాతం మంది విద్యార్థులు తమ ఉన్నత విద్యా ప్రయాణంలో ప్రైవేట్ కళాశాల విద్యను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాలేజ్‌దేఖో విద్యార్థులకు సరైన కళాశాలను చేరుకోవడానికి మార్గనిర్దేశం చేస్తుంది. అదే సమయంలో కాలేజీల సిబ్బంది విద్యార్థులకు బాగా బోధించడానికి సహాయం చేస్తుంది. ఈ క్రమంలో కాలేజ్‌ దేఖో ప్రతి విద్యార్థికి కాలేజీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. విద్యార్థులు సాధించిన మార్కులు, ర్యాంకుల ఆధారంగా తక్కువ ఫీజుతో మంచి కాలేజీల్లో చేరేందుకు మార్గదర్శకత్వం కూడా అందిస్తుంది. విద్యార్థుల మంచి భవిష్యత్తుకు కాలేజ్‌దేఖో మంచి బాట వేయడమే కాకుండా భరోసాని అందిస్తుంది. దీంతో ప్రతి ఏడాది ఎంతో మంది విద్యార్థులు మంచి విద్యను పొందగలుగుతున్నారు. వారి కలలను సాకారం చేసుకునేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు.


పేద, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దగ్గర చేయడమే లక్ష్యంగా కాలేజ్‌దేఖో ముందుకు సాగుతూనే ఉంది. ఈ లక్ష్య సాధన కోసం కాలేజ్‌దేఖో విద్యార్థులకు, కాలేజీలకు రకరకాల సేవలను అందిస్తుంది. విద్యార్థుల కోసం ఏ కెరీర్‌ని సెలక్ట్ చేసుకోవాలి, ఏ కోర్సు మంచిది అనే సలహాలు, సూచనలను అందిస్తుంది. దీంతో విద్యార్థులకు ఎటువంటి గందరగోళం లేకుండా తమ కెరీర్‌ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. అదేవిధంగా కాలేజీల ఫీజు, పరీక్షలు, ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్‌, ట్రాకింగ్ అప్లికేషన్‌లు, స్టడీ మెటీరియల్ వంటి సమాచారాన్ని పూర్తిగా అందిస్తుంది. అదేవిధంగా విద్యార్థులకు మెరుగైన విద్య అందించే విధంగా కాలేజీలకు కూడా కాలేజ్‌దేఖో మంచి మార్గదర్శకత్వం అందిస్తుంది. భవిష్యత్తు నైపుణ్యాలతో పాఠ్యాంశాల విషయంలో, బలమైన ఆర్థిక పనితీరు కోసం, డిజిటల్ మార్కెటింగ్ విషయంలో కాలేజ్‌దేఖో కాలేజీలకు సలహాలు అందిస్తుంది.


రుచిర్ అరోరా

CEO & సహ వ్యవస్థాపకులు


రుచిర్ అరోరా కాలేజ్ దేఖో CEO, సహ-వ్యవస్థాపకులు. రుచిర్ అరోరా 2015 నుంచి కాలేజ్‌దేఖోని ఉన్నత కాలేజీలను గుర్తించేందుకు, మార్గదర్శకత్వం అందించేందుకు, ఎన్‌రోల్‌‌మెంట్ సేవల కోసం ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న నగరం నుంచి వచ్చిన రుచిర్ ఉన్నత విద్యకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడం కోసం వ్యక్తిగతంగా కష్టపడ్డారు.దీంతో ఈ సమస్యలో ఉన్న తీవ్రతను రుచిర్ అర్థం చేసుకున్నారు. భవిష్యత్తు తరాలు ఇలాంటి సమస్యను ఎదుర్కోకూడదని భావించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కాలేజ్‌దేఖోని ఏర్పాటు చేశారు. రుచిర్ అరోరా VNIT నాగ్‌పూర్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో BTech, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) హైదరాబాద్ నుండి MBA పట్టా పొందారు. కాలేజీ దేఖో స్థాపించడానికి ముందు, అతను హిందుస్థాన్ టైమ్స్, బిర్లాసాఫ్ట్ లిమిటెడ్, IBM, CSC ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్‌లో లీడర్‌గా పని చేశారు.


రోహిత్ సాహా

సహ వ్యవస్థాపకులు


రోహిత్ సాహా కాలేజ్‌దేఖో సహ వ్యవస్థాపకులు.కంపెనీ అమ్మకాలు, ఆదాయ ఆప్టిమైజేషన్‌ను పర్యవేక్షిస్తారు. రోహిత్ 2001లో VNIT నాగ్‌పూర్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు.అయితే వీడియోకాన్‌లో పని చేస్తున్నప్పుడు సేల్స్‌పై తనకున్న ఇష్టాన్ని తెలుసుకున్నారు. అక్కడ అతను ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విక్రయాలను నిర్వహించారు. భారతి ఎయిర్‌టెల్, ఇండియా టైమ్స్, సిఫీ టెక్నాలజీస్, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో లీడర్ షిప్‌ రోల్స్‌లో పని చేశారు. ఈ 14 సంవత్సరాల అనుభవంతో అతను కాలేజ్‌దేఖో సహ-స్థాపనకు సన్నద్ధమయ్యారు. కాలేజీ దశ నుంచి రుచిర్‌, రోహిత్ మంచి స్నేహితులు.ఈ స్నేహమే అభ్యర్థుల ఉన్నత విద్యా ప్రయాణాన్ని మెరుగుపరచడానికి ఈ వెంచర్‌లో చేరడానికి రోహిత్ సాహా ఉత్సాహపరిచింది.


సౌరభ్ జైన్

సహ వ్యవస్థాపకులు


సౌరభ్ జైన్ కాలేజ్ దేఖో సహ వ్యవస్థాపకులు. సౌరభ్ జైన్ 2001లో VNIT నాగ్‌పూర్ నుంచి పట్టభద్రుడయ్యాక US, యూరప్‌లోని కాగ్నిజెంట్‌లో పనిచేశారు. అలాగే టెలికాం ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించారు. భాగస్వామి డెలివరీ కోసం పెద్ద టీమ్‌‌లను నిర్మించారు. సౌరభ్ పూణేలో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ సెంటర్, సోషల్ కమాండ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన ప్రవర్తనకు పేరుగాంచిన సౌరభ్ వ్యాపారం, వ్యక్తిగత విషయాలపై విలువైన అవగాహనను అందిస్తారు. కాలేజ్‌దేఖోలో అతను సరైన కళాశాలలను, విద్యార్థులను గుర్తించడం, సరిపోల్చడంలో నాయకత్వం వహిస్తారు.