తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్ 2025 లింక్ (TS Inter Hall Ticket 2025 Download Link) : తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి 25, 2025వ తేదీ వరకు జరగనున్నాయి. TSBIE త్వరలో TS ఇంటర్ పరీక్లష హాల్ టికెట్ 2025ను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తుంది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని దాని ప్రింట్ తీసుకోవాలి. లింక్ (TS Inter Hall Ticket 2025 Download Link) యాక్టివేట్ అయిన వెంటనే పరీక్ష రోజు సూచనలతో పాటు ఇక్కడ యాక్టివేట్ చేయబడుతుంది.
ఇది కూడా చూడండి: తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ వెయిటేజీ 2025
తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్ 2025: డౌన్‌లోడ్ లింక్ (TS Inter Theory Exams Hall Ticket 2025: Download Link)
TS ఇంటర్ థియరీ పరీక్షల హాల్ టికెట్ 2025 కోసం డౌన్‌లోడ్ లింక్ ఇక్కడ అందిస్తాం. అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలైన వెంటనే ఇక్కడ యాక్టివేట్ చేయబడుతుంది:
తెలంగాణ ఇంట్మీడియట్ పరీక్షల హాల్ టికెట్ 2025ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను యాక్సెస్ చేయడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి వారి లాగిన్ వివరాలను అందించవచ్చు.
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష తేదీ సూచనలు 2025 (TS Inter Exam Day Instructions 2025)
TS ఇంటర్ థియరీ పరీక్షలు 2025 కోసం పరీక్ష రోజున అనుసరించాల్సిన కొన్ని వివరణాత్మక సూచనలు ఇక్కడ అందించాం.
- అభ్యర్థులు పరీక్షా సమయానికి 30 నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష ప్రారంభమయ్యే ముందు తమ సీట్లకు వెళ్లి కూర్చోవడానికి అనుమతి ఇస్తారు.
- అభ్యర్థులు వారి తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్ 2025 తో పాటు చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్‌ను కచ్చితంగా తీసుకెళ్లాలి.
- హాల్ టికెట్‌పై వారు హాజరు కానున్న సబ్జెక్టుల పరీక్ష సమయాలు, సబ్జెక్ట్ కోడ్‌లు ఉంటాయి. కాబట్టి, అభ్యర్థులు పరీక్ష రోజున ఎలాంటి తప్పులు జరగకుండా ఉండటానికి పరీక్షా రోజుకు ముందు హాల్ టికెట్‌లోని వివరాలను చెక్ చేస్తుండాలి.
- అన్ని విద్యార్థులకు వారి పరీక్షలను పూర్తి చేయడానికి సమాన సమయం ఇవ్వబడుతుంది. పరీక్షలు పూర్తయిన తర్వాత మాత్రమే పరీక్షా హాలు నుండి బయటకు వెళ్లడానికి అనుమతించబడుతుంది.