ఆంధ్రప్రదేశ్‌లోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) అధికారిక వెబ్‌సైట్‌లో AP POLYCET 2025 కి సంబంధించిన పరీక్ష తేదీని వెల్లడించింది
. ఈ మేరకు ఏప్రిల్ 30వ తేదీన ఏపీ పాలిసెట్ 2025 జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. ఏపీలో 2025-26 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల సులభతరం చేసే పాలిసెట్ 2025 నిర్వహిస్తారు. పరీక్షకు సన్నాహకంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 69 సమన్వయ కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. సుమారు 150,000 మంది విద్యార్థులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఏపీ పాలిసెట్ 2025 దరఖాస్తు ప్రక్రియ మార్చి మొదటివారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
AP POLYCET పరీక్ష తేదీలు 2025 (AP POLYCET Exam Date 2025)
AP POLYCET 2025 పరీక్ష తేదీలు దిగువున టేబుల్లో అంచనాగా అందించడం జరిగింది.
ఏపీ పాలిసెట్‌కు అప్లై చేసుకోవడానికి ప్రతి అభ్యర్థి కచ్చితంగా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. OC, వెనుకబడిన తరగతులు (BC) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 400గా నిర్ణయించబడింది. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. విద్యా శాఖ పరీక్షకు అవసరమైన సన్నాహాలను ప్రారంభించాలని సాంకేతిక విద్యా శాఖను ఆదేశిస్తూ ఒక ఉత్తర్వు కూడా జారీ చేసింది. పాలీసెట్ 2025కి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల అవుతుంది.
మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ తెలుగు వార్తల కోసం
https://telugunews.collegedekho.com/ ఈ లింక్‌పై క్లిక్ చేయడి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. తాజా వివరాలను, విశేషాలను ఇక్కడ చూడండి. ఎంట్రన్స్, జాబ్ ఆఫర్లు, రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన అన్ని వివరాలన ఇక్కడ ఎప్పటికప్పుడు అందిస్తాం.