ఏపీలో ఒంటిపూట బడులు 2025 (Half Day Schools 2025 in Andhra Pradesh) : మార్చి నెల నుంచి ఎండా కాలం మొదలైపోతుంది. అదే సమయంలో మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది (2025) కూడా పాఠశాల విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఎండ వేడిమికి గురవ్వకుండా ఉండేందుకు పాఠశాలలను ఒక పూటకు పరిమితం చేస్తారు. అంటే ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే పాఠశాలలను నిర్వహిస్తారు. గత సంవత్సరాల ట్రెండ్‌లను అనుసరించి మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు (Half Day Schools 2025 in Andhra Pradesh) ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు కూడా మొదలుకానున్న నేపథ్యంలో 1వ తరగతి నుంచి 9 తరగతుల విద్యార్థులకు విద్యా సంవత్సరంలో చివరి పని రోజు వరకు ఒంటిపూట బడులు పెట్టే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఏడాది ఒంటిపూట బడులపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు.
ఇది కూడా చూడండి: తెలంగాణలో ఒకపూట బడులు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
తర్వలో ఒంటిపూట బడులపై (Half Day Schools 2025 in Andhra Pradesh)పాఠశాల విద్యాశాఖ ప్రకటనను జారీ చేసే అవకాశం ఉంది. ముందుగా ఒంటిపూట బడులపై ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా కమిషనర్ అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు, పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు ఉత్తర్వులు జారీ చేస్తారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మోడల్ పాఠశాలలు, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్ పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. అదే విధంగా ఏప్రిల్ నెలనుంచి జూన్ వరకు వేసవి సెలవులు ఉంటాయి. దీనిపై కూడా అతి త్వరలో ప్రకటన రానుంది.
అదేవిధంగా ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ (AP)లో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి పరీక్షలు మార్చి నెల నుంచి జరుగుతాయని అంచనా వేయబడింది. కచ్చితమైన తేదీలు, టైమ్‌టేబుల్‌లను ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) పరీక్ష తేదీకి దగ్గరగా విడుదల చేసే ఛాన్స్ ఉంది. తాజా అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ని చెక్ చేయవచ్చు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం
https://telugunews.collegedekho.com/ ఈ లింక్‌పై క్లిక్ చేయడి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. తాజా విశేషాలను, వివరాలను ఇక్కడ చూడండి.