తెలంగాణ స్కూళ్లకు సెలవులు 2025 (Telangana School Holidays February 2025) : తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు మంచి ఛాన్స్ వచ్చింది. మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. వివిధ కారణాల వల్ల తెలంగాణ అధికారులు ఫిబ్రవరి 14 నుంచి 16, 2025 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మూడు రోజుల సెలవు
(Telangana School Holidays February 2025) ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దీంతో విద్యార్థులు మూడు రోజుల సెలవులను ఎంజాయ్ చేయవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నందున వారి పండుగలకు అక్కడ ప్రత్యేకత ఉంటుంది. ఈ మేరకు ఫిబ్రవరి 14న షబ్-ఎ-బరాత్ ఉంది. ఈ సందర్భంగా అక్కడి ప్రభుత్వం పాఠశాలలకు ఆప్షనల్ హాలుడే ప్రకటించింది. ఇది తప్పనిసరి సెలవు కాదు. కానీ ఈ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలోని చాలా పాఠశాలలు క్లోజ్ చేయబడతాయి.
ఇక ఫిబ్రవరి 15న (శనివారం) బంజారాల ఆరాధ్య నేత సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి. దీంతో ఫిబ్రవరి 15 బంజారా సమాజానికి సాంస్కృతికంగా ముఖ్యమైనది. ఇందులో భాగంగా బంజారాలు ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది ప్రభుత్వం సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. ఈ ఏడాది కూడా సెలవు ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఫిబ్రవరి 16 ఆదివారం ఆరోజున సహజంగానే పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. ఇలా పాఠశాలలకు మూడు రోజుల పాటు సెలవు రానుంది. వీకెండ్ కావడంతో ఈ సెలవులను
(Telangana School Holidays February 2025) స్కూల్ విద్యార్థులు ఎంజాయ్ చేస్తారు. అదే విధంగా ఈ మూడు రోజుల విరామం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విశ్రాంతి, రిఫ్రెష్ అవ్వడానికి అనుగుణంగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన సెలవుల వల్ల ఎప్పుడు చదువుతో సతమతం అయ్యే పిల్లలు కాస్తా ఉల్లాసంగా గడిపే అవకాశం దొరుకుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం
https://telugunews.collegedekho.com/ ఈ లింక్‌పై క్లిక్ చేయడి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. తాజా విశేషాలను, వివరాలను ఇక్కడ చూడండి.