ఏపీలో పరీక్షల కాలం మొదలైంది. ఎండలు కూడా పెరుగుతున్నాయి. మార్చిలో ఇంటర్ పరీక్షలు, పదో తరగతి పరీక్షలు కూడా జరగనున్నాయి. అనంతరం ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ నెలలో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల ఎప్పటి నుంచి మొదలవుతాయనే ఆసక్తి విద్యార్థుల్లో నెలకొంది. వేసవి సెలవులు సాధారణంగా కొన్ని వారాల పాటు ఉంటాయి, ఇది పాఠశాల విద్యా క్యాలెండర్‌ను బట్టి ఉంటుంది. కొన్ని పాఠశాలలకు ఎక్కువ వేసవి సెలవులు ఉండవచ్చు, మరికొన్నింటికి తక్కువ విరామం ఉండవచ్చు. ఈ సమయంలో, పాఠశాలలు సాధారణంగా క్లోజ్ చేయబడతాయి. ఈ మేరకు వేసవి సెలవులకు సంబంధించి అంచనాగా తేదీలని ఇక్కడ అందించాం. స్కూళ్లకు ఈ సంవత్సరం ఏప్రిల్ 21 లేదా 24వ తేదీల నుంచి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. మళ్లీ పాఠశాలలు జూన్ 13వ తేదీన తెరుచుకుంటాయి. అంటే ఏపీలో పాఠశాలలకు దాదాపు 45 రోజుల పాటు సెలవులు ఉంటాయి. పాఠశాల విద్యాశాఖ ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు ఈ సెలవులను ప్రకటిస్తుంది. కచ్చితంగా ఆరోజుల్లో క్లాసులను నిర్వహించకూడదు.
ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు వేసవి సెలవులు 2025 (Summer Holidays for AP Schools 2025)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు వేసవి సెలవుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుదీర్ఘమైన విద్యా సంవత్సరం తర్వాత వేసవి సెలవులు విద్యార్థులకు విశ్రాంతి తీసుకోవడానికి, మళ్లీ ఆహ్లాదకరంగా గడపడానికి అవకాశాన్ని ఇస్తాయి. అంతేకాదు ఉపాధ్యాయులకు కూడా వేసవి సెలవులు విశ్రాంతి తీసుకోవడానికి ఒక అవకాశం. వారి సొంత ఆసక్తులను కొనసాగించడానికి, అలాగే రాబోయే విద్యా సంవత్సరానికి ప్రణాళికలు వేసుకుని సిద్ధం కావడానికి ఒక అవకాశం.
అన్ని యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలలు ఏప్రిల్ 20 లేదా ఏప్రిల్ 23వ తేదీ వరకు పనిచేస్తాయి. దాంతో ఉపాధ్యాయులు సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షల మూల్యాంకనాన్ని పూర్తి చేసి, తదుపరి సంవత్సరానికి అడ్మిషన్లు తీసుకుంటారు.