ఏపీ మోడల్ స్కూల్ ఆరో తరగతి అడ్మిషన్లు 2025: ఏపీ మోడల్ స్కూల్ ఆరో తరగతి అడ్మిషన్లు 2025 కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2025-26 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ మేరకు ఏపీ మోడల్ స్కూల్స్ నుంచి ప్రకటన వెలువడింది. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు చేసుకునే విధానం, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఆన్‌లైన్ అప్లికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందించడం జరిగింది.
ఏపీ మోడల్స్ స్కూల్ 6వ తరగతి అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ PDF
ఏపీ మోడల్స్ స్కూల్ 6వ తరగతి అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ PDF ఈ దిగువున అందించాం. ఇక్కడ క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.
ఏపీ మోడల్ స్కూల్ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 షెడ్యూల్ (AP Model Schools Admission Entrance 2025 Schedule)
ఏపీ మోడల్ స్కూల్ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 షెడ్యూల్‌ను ఈ దిగువున అందించాం. విద్యార్థుల పరిశీలించవచ్చు.
ఏపీ మోడల్ స్కూల్స్ ఆరో తరగతి ఎంట్రన్స్ అర్హత ప్రమాణాలు 2025 (AP Model Schools 6th Entrance Eligibility 2025)
ఏపీ మోడల్స్ స్కూల్స్ ఆరో తరగతి ఎంట్రన్స్ టెస్ట్ కోసం విద్యార్థులకు ఈ దిగువున తెలిపిన అర్హత ప్రమాణాలు ఉండాలి.
- ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి బీసీ విద్యార్థుల 01-09-2013 నుంచి 31-08-2015 మధ్య పుట్టి ఉండాలి
- ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2011 నుంచి 31-08-2015 మధ్య పుట్టి ఉండాలి.
- సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నిరవధికంగా 2023-24, 2024-25 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి. 2024-25 సంవత్సరములో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.
- దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారపత్రము కోసం WWW.cse.ap.gov.in లేదా WWW.apms.apcfss.in చూడవచ్చు.
ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతి ఎంట్రన్స్ టెస్ట్ 2025- దరఖాస్తు ఫీజు
ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతి ఎంట్రన్స్ టెస్ట్‌కు అప్లై చేసుకోవాలనుకునే విద్యార్థులకు కచ్చితంగా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.150లు, ఎస్సీ, ఎష్టీ అభ్యర్థులు రూ.75లు చెల్లించాలి. అదే విధంగా ప్రవేశ పరీక్షలో ఓసీ, బీసీ విద్యార్థులు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 30 మార్కులు సాధించాలి.