ఏపీ ఇంటర్ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ లింక్ (AP Inter Hall Ticket 2025 Download Link) : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి ఒకటో తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈరోజు అంటే ఫిబ్రవరి 21న విడుదలయ్యాయి. ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ల లింక్ సంబంధిత వెబ్‌సైట్‌లో శుక్రవారం యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. వెబ్‌సైట్‌లో యాక్టివేట్ అయిన వెంటనే ఇక్కడ డౌన్‌లోడ్ లింక్‌ని ఇక్కడ అందిస్తాం. దీంతో అభ్యర్థులు ఏపీ ఇంటర్ హాల్ టికెట్లను ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈసారి
ఏపీ హాల్ టికెట్లను వాట్సాప్ నుంచి కూడా పొందే ఛాన్స్ ఉంది. విద్యార్థులు ఇక్కడ ఏపీ ఇంటర్ హాల్ టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలను పొందవచ్చు.
ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు (AP Inter Hall Ticket 2025 Download Link)
విడుదలైన వెంటనే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను
bie.ap.gov.in వద్ద డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలా చేయడానికి, అభ్యర్థులు హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వారి మొదటి సంవత్సరం హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి వారి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. ప్రత్యామ్నాయంగా, అభ్యర్థులు లాగిన్ సమయంలో హాల్ టికెట్ నెంబర్‌కు బదులుగా వారి ఆధార్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా కూడా వారి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. విద్యార్థులు పరీక్షా హాలులోకి ప్రవేశించడానికి హాల్ టికెట్ కచ్చితంగా ఉండాలి. ఏపీ ఇంటర్ ఎగ్జామ్ హాల్ టికెట్‌పై పరీక్షా తేదీలు, సమయాలు, మీ పరీక్ష కేంద్రం స్థానంతో సహా మీ పరీక్ష వివరాలు ఉంటాయి.
ఇది కూడా చూడండి: వాట్సాప్‌లోనే ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు 2025
ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ 2025 (AP Inter Hall Ticket 2025 Download Link)
ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ 2025ని ఇక్కడ అందించాం. అధికారిక వెబ్‌సైట్‌లో యాక్టివేట్ అయిన వెంటనే ఇక్కడ అందిస్తాం.
ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు 2025 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download the AP Inter Hall Ticket 2025?)
విద్యార్థులు ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను ఈ దిగువున తెలిపిన విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ముందుగా అభ్యర్థులు అధికారిక BIEAP వెబ్‌సైట్‌ను bie.ap.gov.in సందర్శించాలి.
- హోంపేజీలో “IPE మార్చి-2025 హాల్ టికెట్ల డౌన్‌లోడ్” అనే లింక్‌ను గుర్తించి దానిపై క్లిక్ చేయాలి.
- తర్వాత కొనసాగడానికి “మొదటి సంవత్సరం” అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో మీ ఆధారాలను నమోదు చేయాలి అంటే మీ హాల్ టికెట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ నమోదు చేయాలి.
- వెంటనే “హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి” అనే బటన్ పై క్లిక్ చేయాలి. వెంటనే మీ హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
- అనంతరం హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
ఇలా చేస్తే వాట్సాప్‌కే ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు 2025 (WhatsApp Facility for AP Inter Hall Ticket 2025)
యాక్సెసిబిలిటీని పెంచే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.
- ముందుగా వాట్సాప్‌లో 9552300009 కు Hi అని మెసెజ్ పెట్టాలి.
- తర్వాత సేవను ఎంచుకోండి : “విద్యా సేవలు” ఎంచుకోవడానికి ప్రాంప్ట్‌లను అనుసరించాలి.
- ముందుగా “పరీక్ష హాల్ టికెట్ డౌన్‌లోడ్” అనే ఆప్షన్‌ని, తర్వాత “ఇంటర్మీడియట్ పరీక్ష హాల్ టికెట్” అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. .
- ప్రాంప్ట్ చేయబడిన విధంగా మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
- అనంతరం మీ హాల్ టికెట్ నేరుగా మీ వాట్సాప్‌కు పంపబడుతుంది.