డైలీ కరెంట్ అఫైర్స్ 21 ఫిబ్రవరి 2025 : ఫిబ్రవరి 21వ తేదీన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీ పోటీ పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు ఇతర పరీక్షల కోసం వివరంగా చూడవచ్చు.
డైలీ కరెంట్ అఫైర్స్ 21 ఫిబ్రవరి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affairs in Telugu 21 February 2025: National and International)
- ఢిల్లీ ముఖ్యమంత్రిగా 20 ఫిబ్రవరి తేదీన రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు.
- హర్యానా ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణ చట్టానికి మార్పులు చేసింది , మగ నీల్గేయ్స్ ను కాల్చడానికి (చంపడానికి) అనుమతిస్తూ ఉత్తర్వులు జరీ చేసింది. ఈ జంతువులను బ్లూ బుల్స్ అని కూడా అంటారు.
- ఉక్రెయిన్ యుద్ధంపై డోనాల్డ్ ట్రంప్ చేసిన శాంతి ప్రతిపాదనకు జీ 20 సదస్సులో చైనా మద్దతు తెలిపింది.
- స్పేస్ X పై ఇమ్మిగ్రేషన్ కేసును ఉపసంహరించుకోవాలని US ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించింది.
- నేషనల్ పారా అద్లేటిక్స్ ఛాంపియన్షిప్ లో 400 మీటర్ల పరుగు విభాగంలో జీవాంజి దీప్తి స్వర్ణ పతాకాన్ని, ఎఫ్40 జావెలిన్ త్రో విభాగంలో కలేష్ బాషా కాంస్య పతాకాన్ని సాధించారు
- రీఛార్జిబుల్ లిథియం బ్యాటరీల తయారీలో భారత్ మరియు అర్జెంటీనా దేశాలు కీలకమైన ఒప్పందం చేసుకున్నాయి. ఈ సమావేశంలో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
- జూలై 6,7 తేదీల్లో బ్రెజిల్ దేశంలో బ్రిక్స్ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు.
- ఎఫ్-35 యుద్ధ విమానాలను భారత్ కు విక్రయించడానికి అమెరికా ఆమోదం తెలిపింది.
- టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన ఉమెన్ ఆఫ్ ది ఇయర్ లిస్ట్ లో భారతదేశం నుండి పూర్ణిమ దేవి బర్మన్ చోటు దక్కించుకున్నారు.
- కథక్ నాట్యాచార్యుడు రాఘవ్ రాజ్ భట్ కు తులసి సమ్మాన్ పురస్కారం లభించింది.
- జాన్ మెక్ ఫాల్ అనే వ్యక్తి వైకల్యంతో అంతరిక్ష యాత్ర చేయనున్న మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించబోతున్నాడు.