డైలీ కరెంట్ అఫైర్స్ 19 ఫిబ్రవరి 2025 : ఫిబ్రవరి 19వ తేదీన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీ పోటీ పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు ఇతర పరీక్షల కోసం వివరంగా చూడవచ్చు.
డైలీ కరెంట్ అఫైర్స్ 19 ఫిబ్రవరి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affaris in Telugu 19 February 2025: National and International)
- అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అధారిటీ (APEDA), ఆగ్రోస్ట్రర్ మరియు KB ఎక్సపోర్స్ట్స్ సహకారంతో తొలిసారిగా భారతదేశం నుండి సంగోల మరియు భగవా దానిమ్మలను సముద్రమార్గంలో ఆస్ట్రేలియాకు ఎగుమతి చేసింది.
- భారతదేశ ప్రధాన మంత్రి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పర్యటించారు, అమెరికా - భారత్ సత్సంమబంధాలను కొనసాగించడం, చైనా ను ఎదుర్కోవడం ఆయన పర్యటన ముఖ్య కారణాలు.
- వికారాబాద్ జిల్లా కంకల్ గ్రామంలో పురావస్తు శాఖ పరిశోధనల్లో కళ్యాణ చాళుక్యుల కాలంనాటి శాసనాలు లభించాయి. ఈ శాసనాలు సోమేశ్వర చక్రవర్తి-III మరియు భూలోకమల్లదేవ పరిపాలన కాలం నాటివి.
- ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన (PMFBY) ప్రారంభమై ఫిబ్రవరి 18వ తేదీతో 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2016 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ పధకాన్ని ప్రారంభించారు.
- భారత సైన్యం ఇన్ఫయంటరీ వెపన్ ట్రైనింగ్ సిమ్యులేటర్ ను రాయల్ కంబోడియన్ ఆర్మీ (RCA) కు అందజేసింది.
- స్టాండర్డ్ ఛార్టర్డ్ CEO గా PD సింగ్ ను నియమిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
- MSME ల కోసం మ్యూచువల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రారంభించారు.
- ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్ (PM-AASHA) పథకాన్ని 2025-26 వరకు పొడిగించారు.
- డెవల్యూషన్ ఇండెక్స్ రిపోర్ట్ 2024 లో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.
- రీసైక్లింగ్ మరియు వాతావరణ మార్పుల పై ఏర్పాటు చేసిన సమావేశాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రారంభించారు.
- భారతదేశం మరియు ఖతార్‌లు వ్యూహాత్మక భాగస్వామ్యంగా తమ సంబంధాలను బలోపేతం చేసుకున్నాయి, వాణిజ్యం, శక్తి, పెట్టుబడులు, ఆవిష్కరణ, సాంకేతికత, ఆహార భద్రతకు సంబందించిన ఎంఓయూ కుదుర్చుకున్నాయి
- 8వ మిస్సైల్ కమ్ ఎమ్యునిషన్ బార్జ్, LSAM 11 (యార్డ్ 79), విశాఖపట్నం నుండి SECON ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మహారాష్ట్రలోని మీరా భయందర్‌లో ప్రారంభించబడింది.