TGPSC గ్రూప్ 1 ఫలితాల తేదీ 2025: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 1 పరీక్షలు 21 అక్టోబర్ 2024 నుండి 27 అక్టోబర్ 2024 వరకు నిర్వహించింది. ఇప్పుడు అభ్యర్థులు తమ TGPSC గ్రూప్ 1 ఫలితాలు మార్చి 2025 మొదటి వారంలోపు విడుదల కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్ I సర్వీసుల కోసం బహుళ ఖాళీలను భర్తీ చేయడానికి TGPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. TGPSC గ్రూప్ 1 పరీక్ష ఫలితాల అంచనా సమయాన్ని ఇక్కడ చూడండి.
కమిషన్ తన ఏ పరీక్షల ఫలితాల విడుదల తేదీలను క్రింది పట్టికలో చూడవచ్చు.
TGPSC గ్రూప్ 1 ఈవెంట్స్ |
వివరాలు |
TGPSC గ్రూప్ 1 పరీక్ష తేదీ |
1 అక్టోబర్ 2024 నుండి 27 అక్టోబర్ 2024 వరకు |
TGPSC గ్రూప్ 1 ఫలితాల తేదీ |
7 మార్చి 2025 తేదీలోపు |
ఫలితాల ప్రకటన అధికారిక వెబ్‌సైట్ |
tspsc.gov.in |
TGPSC గ్రూప్ 1 పరీక్ష ద్వారా మొత్తం 563 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం 21,093 అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షలకు హాజరయ్యారు.
TGPSC గ్రూప్ 1 ఫలితాలు విడుదలైన అతి త్వరలోనే గ్రూప్ 2 ఫలితాలు కూడా విడుదల చేయడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు, వీటితో పాటుగా TSPSC గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు కూడా అతి త్వరలో విడుదలకానున్నాయి. దీనికోసం TGPSC ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఫలితాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 2024 నవంబర్ 17, 18 తేదీలలో TSPSC గ్రూప్ 3 పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షకు దాదాపు 5 లక్షల 36 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 2.69 లక్షల మంది ఈ TSPSC గ్రూప్ 3 పరీక్షకు హాజరయ్యారు. వారంతా ఫలితాల (TSPSC Group 3 Results Expected Date 2025) విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. TSPSC గ్రూప్ 3 ఫలితాలు 2025 ఫిబ్రవరి 2025లో ఏ క్షణమైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ గ్రూప్ 3 ప్రిలిమినరి ఆన్సర్ కీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.