APPSC గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్ 2025 (APPSC Group 2 Mains Hall Ticket 2025) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్స్ ఈరోజు అంటే 13 ఫిబ్రవరి 2025 తేదీన విడుదల అయ్యాయి. APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష 23 ఫిబ్రవరి,2025 తేదీన నిర్వహించనున్నారు. APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షకు మొత్తం 4,83,525 మంది అభ్యర్థులు అప్లై చేయగా 92,250 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించారు. APPSC బోర్డు ఈరోజు హాల్ టికెట్ ను విడుదల చేసింది.
APPSC గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్ 2025 డైరెక్ట్ లింక్ (APPSC Group 2 Mains Hall Ticket 2025 Direct Link)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్ డైరెక్ట్ లింక్ ఇక్కడ చూడండి.
APPSC గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్ 2025 ఎలా డౌన్లోడ్ చేయాలి ? ( How To Download APPSC Group 2 Mains Hall Ticket 2025)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించాలి.
- అభ్యర్థులు ఈ ఆర్టికల్ లో అందించిన డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి. లేదా
- APPSC అధికారిక వెబ్సైట్ psc.gov.in ఓపెన్ చేయాలి.
- గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్ అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయాలి.
- అభ్యర్థి OTPR ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చ ఫిల్ చేయాలి.
- ఇప్పుడు హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది.
- డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేయండి.
ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన మరిన్ని తాజా వార్తల కోసం
CollegeDekho ను ఫాలో అవ్వండి.