తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు ఎక్స్ పెక్టెడ్ డేట్ 2025 (TSPSC Group 3 Results Expected Date 2025) : TSPSC గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు అతి త్వరలో విడుదలకానున్నాయి. దీనికోసం TGPSC ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఫలితాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 2024 నవంబర్ 17, 18 తేదీలలో TSPSC గ్రూప్ 3 పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షకు దాదాపు 5 లక్షల 36 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 2.69 లక్షల మంది ఈ TSPSC గ్రూప్ 3 పరీక్షకు హాజరయ్యారు. వారంతా ఫలితాల (TSPSC Group 3 Results Expected Date 2025) విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. TSPSC గ్రూప్ 3 ఫలితాలు 2025 ఫిబ్రవరి 2025లో ఏ క్షణమైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ గ్రూప్ 3 ప్రిలిమినరి ఆన్సర్ కీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
జూనియర్ అసిస్టెంట్, ఎల్డీ స్టెనో, టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు 1365 ఖాళీలను భర్తీ చేయడానికి TSPSC గ్రూప్ 3 పరీక్ష జరిగింది. TSPSC గ్రూప్ 3 ఫలితాలు 2025 కేటగిరీ వారీగా కటాఫ్ మార్కులతో పాటు విడుదలవుతాయి. కటాఫ్ మార్కులు పొందిన అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవడానికి షార్ట్ లిస్ట్ చేయబడతారు. ఫలితాన్ని చెక్ చేయడానికి, అభ్యర్థులు www.tspsc.gov.in దగ్గర ఉన్న అధికారిక TSPSC వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అభ్యర్థులు వారి రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు.
తెలంగాణ గ్రూప్ 3 కటాఫ్ మార్కులు (TSPSC Group 3 Cut Off Marks)
TSPSC గ్రూప్ 3 పరీక్ష 2024లో ఉత్తీర్ణత సాధించడానికి కటాఫ్ మార్కులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ https://tspsc.gov.in/ దగ్గర ఫలితాలతో పాటు విడుదల చేస్తుంది. అభ్యర్థులు కమిషన్ విడుదల చేసిన కనీస కటాఫ్ మార్కులను సాధించాలి. పరీక్షలో కనీసం 40 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు తదుపరి రౌండ్ ఎంపికకు అర్హులవుతారు. ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్. TSPSC గ్రూప్ 3 కోసం ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ మార్కులు దిగువున ఇవ్వడంజరిగింది. ఈ పరీక్షలో విజయం సాధించడానికి కనీస అర్హత వివిధ కేటగిరీలకు భిన్నంగా ఉంటుందని ఈ పరీక్ష అభ్యర్థులు తెలుసుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం
https://telugunews.collegedekho.com/ ఈ లింక్‌పై క్లిక్ చేయడి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. తాజా విశేషాలను, వివరాలను ఇక్కడ చూడండి.