డైలీ కరెంట్ అఫైర్స్ 18 ఫిబ్రవరి 2025 : ఫిబ్రవరి 18వ తేదీన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీ పోటీ పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు ఇతర పరీక్షల కోసం వివరంగా చూడవచ్చు.
లేటెస్ట్ : DRDOలో ఇంటర్న్‌షిప్, ఈ అర్హతలుంటే మంచి ఛాన్స్..
డైలీ కరెంట్ అఫైర్స్ 18 ఫిబ్రవరి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affaris in Telugu 18 February 2025: National and International)
- యునైటెడ్ కింగ్డం అభివృద్ధి చేసిన గ్రేవ్ హాక్ హైబ్రిడ్ క్షిపణులను ఉక్రెయిన్ కొనుగోలు చేసింది, రష్యా చేస్తున్న దాడుల నుండి రక్షణ పొందడానికి ఈ క్షిపణులను ఉక్రెయిన్ కొనుగోలు చేసింది. వేగంగా కదిలే మనుషులను, వస్తువులను ఈ క్షిపణులు ప్రభావవంతంగా ఎదుర్కోగలవు.
- డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో వ్యాప్తి చెందుతున్న mpox క్లాడ్ ib అనే వ్యాధి ప్రధానంగా లైంగిక కార్యకలాపాల వలన వ్యాపిస్తుందని జన్యు సంబంధ , అంటువ్యాధి గురించిన అధ్యయనాలు వెల్లడించాయి.
- MDN 100 అని పిలవబడే ప్రత్యేకమైన స్టీల్ తయారీ కోసం DRDO ( డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ) మరియు MIDHANI ( మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్) సంస్థలు ఒప్పందం కుర్దూర్చుకున్నాయి. ఈ ప్రత్యేకమైన ఉక్కు అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిరోక్రాఫ్ట్ (AMCA) కోసం రూపొందించబడుతుంది.
- కేరళ రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన KASAP ( కారుణ్య ఆరోగ్య సురక్ష పదాతి) పథకానికి మరో 300 కోట్లను కేటాయించారు. దీంతో మొత్తం ఈ పధకానికి కేటాయించిన నిధుల మొత్తం 978.54 కోట్ల రూపాయలకు చేరుకుంది.
- ఉక్రెయిన్ యుద్ధం గురించి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మానియేల్ మాక్రోన్ యూరోప్ అత్యవసర మీటింగ్ ను హోస్ట్ చేయనున్నారు. జర్మనీ , ఇటలీ , జార్జియా మరియు NATO ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
- 22 ఫిబ్రవరి 2025 నుండి జమ్మూ కాశ్మీర్ లోని గుల్మార్గ్ లో జరగాల్సిన ఖేళో ఇండియా 2025 వింటర్ గేమ్స్ వాయిదా పడ్డాయి, తక్కువ హిమపాతం వలన ఇవి వాయిదా పడ్డాయి.
- భారతదేశ కేంద్ర ప్రభుతం కొత్త ఎన్నికల ప్రధాన కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ ను నియమించింది, గత కమిషనర్ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18,2025 తేదీన పదవీ విరమణ చేస్తారు.
- భారతదేశం రూపొందించిన ఫోర్త్ జనరేషన్ సబ్ మెరైన్ మత్స్య 6000, విజయవంతంగా 500 మీటర్ల లోతుకి వెళ్లి వచ్చే పరీక్షను పూర్తి చేసింది.
- ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి ప్రయత్నిస్తున్న అమెరికా ప్రభుత్వం, సౌదీ అరేబియాలో రష్యా అధికారులతో సమావేశమయ్యారు, ఈ సమావేశానికి ఉక్రెయిన్ నుండి ఎవరికీ అఆహ్వానించలేదు.