UIIC అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2025 (UIIC Apprentice Recruitment 2025) : భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటైన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ (UIIC) డిగ్రీ అర్హతతో పలు అప్రెంటీస్ పోస్టుల (UIIC Apprentice Recruitment 2025) భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 105 అప్రెంటీస్ పోస్టులకు అర్హులైన ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 1961 అప్రెంటిస్‌షిప్ చట్టం ప్రకారం గతంలో అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తి చేసిన లేదా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ పని అనుభవం ఉన్న దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులవుతారు.
UIIC అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2025 అర్హత ప్రమాణాలు (UIIC Apprentice Recruitment 2025 Eligibility Criteria)
UIIC అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2025 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ దిగువున తెలిపిన అర్హత ప్రమాణాలు ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
- AICTE లేదా UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. గ్రాడ్యుయేట్లు 2021, 2022, 2023 లేదా 2024లో తమ డిగ్రీలను పూర్తి చేసి ఉండాలి.
UIIC అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2025 దరఖాస్తు తేదీలు (UIIC Apprentice Recruitment 2025 Application Dates)
UIIC అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2025కు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఈ దిగువున అందించాం.
UIIC అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? (How to apply online for UIIC Apprentice Recruitment 2025?)
UIIC అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 దరఖాస్తు ప్రక్రియ NATS పోర్టల్ ద్వారా నిర్వహించబడుతుంది. మీ దరఖాస్తును పూర్తి చేయడానికి క్రింది దశలను అనుసరించండి:
- అధికారిక NATS పోర్టల్‌ను సందర్శించాలి.
- “స్టూడెంట్ లాగిన్” పై క్లిక్ చేసి, మీ రిజిస్టర్డ్ ఈ మెయిల్ ID, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
- “ప్రకటించిన ఖాళీలకు దరఖాస్తు చేసుకోండి” కి నావిగేట్ అవ్వాలి.
- “UNITED INDIA INSURANCE CO. LTD” అనే ఆప్షన్‌ను గుర్తించాలి.
- మీ దరఖాస్తును సమర్పించడానికి “వర్తించు” పై క్లిక్ చేయాలి.
- దరఖాస్తు విజయవంతంగా పూర్తయిన తర్వాత మీకు నిర్ధారణ సందేశం వస్తుంది.