మార్చి నెలలో AP DSC నోటిఫికేషన్ జూన్ కి పోస్టింగ్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP మెగా DSC పరీక్షను మార్చిలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. AP DSC నోటిఫికేషన్ 2024 సంవత్సరంలోనే విడుదల కావలసి ఉన్నా కూడా కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడింది. ఎస్సీ వర్గీకరణం ఈ వాయిదాకి ముఖ్య కారణం, ఐతే 2025 సంవత్సరంలో AP DSC ఖచ్చితంగా నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ నెల నాటికి నియామకం పూర్తి చేసి పోస్టింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
AP DSC 2025 నోటిఫికేషన్ విడుదల తేదీ ( AP DSC 2025 Notification Release Date)
ఆంద్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 విడుదల తేదీ మరియు ముఖ్యమైన తేదీలను ఇక్కడ చూడవచ్చు.
AP DSC ఖాళీలు 2024 (AP DSC Vacancy 2024)
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్లు, SGT, TGT, PET, PGT, ప్రిన్సిపల్ పోస్టుల కోసం 16,347 ఉపాధ్యాయుల ఖాళీల కోసం అభ్యర్థులను నియమించడానికి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ బాధ్యత వహించింది. వీటిలో 7725 ఖాళీలు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులకు ఉన్నాయి. పోస్ట్-వైజ్ AP DSC ఖాళీ 2024 కింది టేబుల్లో చేయబడింది.
లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ఎడ్యుకేషనల్ న్యూస్ కోసం
CollegeDekho ను ఫాలో అవ్వండి.