ఇండియన్ నేవీ SSC ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2025 చివరి తేదీ (Indian Navy SSC Officer Recruitment 2025 Last Date): ఇండియన్ నేవీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులను కోరుతుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు భారత నావికాదళం అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ద్వారా చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలోని 270 పోస్టులను భర్తీ చేయనుంది.
ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఫిబ్రవరి 25, 2025న వరకు (Indian Navy SSC Officer Recruitment 2025 Last Date) దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు, ఎంపిక ప్రక్రియ ఇతర వివరాల కోసం ఇక్కడ చూడండి.
ఇండియన్ నేవీ SSC ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీల వివరాలు (Indian Navy SSC Officers Recruitment 2025 Vacancy Details)
270 షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల (Indian Navy SSC Officer Recruitment 2025 Last Date) వివరాలు ఈ దిగువున పట్టికలో అందించాం.
ఇండియన్ నేవీ SSC ఆఫీసర్లు రిక్రూట్‌మెంట్ అర్హత ప్రమాణాలు 2025 (Indian Navy SSC Officers Recruitment 2025 Eligibility Criteria)
కనీసం 60 శాతం మార్కులతో సగటున లేదా తత్సమానమైన CGPAతో గ్రాడ్యుయేషన్/పోస్ట్-గ్రాడ్యుయేషన్ లేదా చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు లేదా విదేశీ విశ్వవిద్యాలయం/కళాశాల/సంస్థ నుంచి సగటున 60 శాతం మార్కులతో లేదా సమానమైన CGPA/సిస్టమ్‌తో ఇంజనీరింగ్ డిగ్రీ పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ నేవీ SSC ఆఫీర్స్ రిక్రూట్‌మెంట్ 2025 ఎలా అప్లై చేసుకోవాలి? (Indian Navy SSC Officers Recruitment 2025 How to Apply)
ఇండియన్ నేవీ SSC ఆఫీసర్ల పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలో ఈ దిగువున అందించాం. ఆ స్టెప్స్‌ని ఫాలో అయి అప్లై చేసుకోవచ్చు.
- ముందుగా అభ్యర్థులు joinindiannavy.gov.inలో ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- హోంపేజీలో అందుబాటులో ఉన్న ఇండియన్ నేవీ SSC ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ 2025 లింక్‌పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- సబ్మిట్ పై క్లిక్ చేసి, ఆపై అకౌంట్‌కు లాగిన్ అవ్వండి.
- లాగిన్ అయిన తర్వాత దరఖాస్తు ఫార్మ్‌ను పూరించండి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
- Submit బటన్‌పై క్లిక్ చేసి, నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేయండి.
- తదుపరి అవసరం కోసం అదే హార్డ్ కాపీని ఉంచండి.
సెలక్షన్ ప్రక్రియలో భాగంగా డిగ్రీలో అభ్యర్థులు పొందిన సాధారణ మార్కుల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. ఖాళీల లభ్యత, సంబంధిత ప్రవేశానికి మెడికల్ క్లియరెన్స్ ప్రకారం అన్ని ఎంట్రీలకు SSB మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. ఎంట్రీలో ఖాళీల లభ్యత ప్రకారం వైద్య పరీక్షకు సరిపోతారని ప్రకటించబడిన అభ్యర్థుల నియామకం జరుగుతుంది.