PWD అభ్యర్థులకు TS EAMCET రిజర్వేషన్ 2025 (TS EAMCET 2025 Reservation for pwd Candidates) : తెలంగాణ ఎంసెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. TS EAMCET 2025కు సంబంధించిన నోటిఫికేషన్ న్యూస్ పేపర్‌లో రిలీజ్ అయింది. అయితే ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు, షెడ్యూల్ వివరాలను గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు వెబ్‌సైట్‌లో పెడతారు. కాగా TS EAMCET 2025 కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వివిధ వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులకు రిజర్వేషన్లు అందిస్తుంది.అందులో భాగంగా ఇక నుంచి దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ (TS EAMCET 2025 Reservation for pwd Candidates) కల్పించనుంది. తొలిసారిగా ఎంసెట్‌లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్‌ని కల్పిస్తున్నారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సారి ఏపీలో విజయవాడ, కర్నూలులో పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేస్తారు.
TS EAMCE 2025 ముఖ్యమైన తేదీలు (TS EAMCE T2025 Important Dates)
తెలంగాణ ఎంసెట్ 2025కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
TS EAMCET 2025 కి అవసరమైన పత్రాలు (Documents Required for TS EAMCET 2025)
తెలంగాణ ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ దిగువున తెలిపిన డాక్యుమెంట్లు కచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి.
- 10వ తరగతి సర్టిఫికెట్ (వయస్సు ప్రూఫ్ కోసం)
- ఇంటర్మీడియట్ (12వ తరగతి) మార్క్‌షీ్ లేదా హాల్ టికెట్
- స్కాన్ చేసిన ఫోటోగ్రాఫ్, సంతకం (JPEG ఫార్మాట్).
- అదనపు సర్టిఫికెట్లు (వర్తిస్తే):
- ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం).
- కుల ధ్రువీకణ పత్రం (SC/ST/PH అభ్యర్థులు).
- నివాస ధ్రువీకణ పత్రం (తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి).
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం
https://telugunews.collegedekho.com/ ఈ లింక్‌పై క్లిక్ చేయడి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. తాజా విశేషాలను, వివరాలను ఇక్కడ చూడండి.