తెలంగాణ పాఠశాలలు వేసవికాలం సెలవులు 2025 ప్రారంభ తేదీ అంచనా (TS Schools Summer Holidays 2025 Expected Start Date) : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు 21 మార్చి నుండి 4 ఏప్రిల్ 2025 తేదీ వరకూ షెడ్యూల్ చేయబడ్డాయి. తెలంగాణ 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు 6 సబ్జెక్ట్లకు ఆరు రోజుల చొప్పున నిర్వహిస్తారు. తెలంగాణ పాఠశాలల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ వారం లోపు పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి పరీక్షలు పూర్తయిన తర్వాత రోజు నుండి విద్యార్థులకు వేసవికాలం సెలవులు ప్రకటించడం జరుగుతుంది.
తెలంగాణ పాఠశాలలు వేసవికాలం సెలవులు 2025 ప్రారంభ తేదీ అంచనా (TS Schools Summer Holidays 2025 Expected Start Date)
తెలంగాణ పాఠశాలల్లో విద్యార్థులకు వేసవికాలం సెలవులు ప్రారంభ తేదీలను ఇక్కడ చూడవచ్చు.
తెలంగాణ పాఠశాలల్లో 6వ తరగతి నుండి 9వ తరగతి పరీక్షల టైం టేబుల్ ను త్వరలోనే అధికారులు విడుదల చేస్తారు. ఈ సంవత్సరం అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉండడం వలన పాఠశాలల పునః ప్రారంభం ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మాత్రం ర్యాంకుల కోసం వేసవికాలంలో కూడా తరగతులు నిర్వహించడం గతంలో అధికారుల దృష్టికి వచ్చింది అయితే వేసవికాలం సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే ఆ పాఠశాలలను అధికారులు సీజ్ చేయనున్నారు. విద్యార్థుల మానసిక మరియు శారీరక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా ఇలా తరగతులు నిర్వహించడం వలన విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.