తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు, పదో తరగతి ఎగ్జామ్స్ వచ్చే నెలలో ప్రారంభంకానున్నాయి. పదో తరగతి పరీక్షల అనంతరం 6 తరగతి నుంచి 10వ తరగతి వరకూ పరీక్షలు ప్రారంభం అవుతాయి. అయితే ఈ పరీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయంపై విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు 6 నుంచి 9వ తరగతి వరకు TS SA 2 వార్షిక పరీక్షలు 2025 ఎప్పుడు జరుగుతాయో ఇక్కడ అంచనాగా తెలియజేసాం. TS స్కూల్ SA 2 పరీక్షల టైమ్ టేబుల్ 2025ను తెలంగాణ ప్రభుత్వం తరపున స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తన అధికారిక వెబ్‌సైట్ http://schooledu.telangana.gov.in/ లో త్వరలో విడుదల చేస్తుంది. ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలు చాలా కీలకం. ఈ పరీక్షల ఫలితాలు విద్యార్థులను తదుపరి విద్యా స్థాయికి ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు TS SA 2 వార్షిక పరీక్షలు 2025 ఏప్రిల్ 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగే అవకాశం ఉంది. పరీక్షల అనంతరం ఏప్రిల్ 23, 2025వ తేదీ నుంచి ప్రొగ్రాస్ రిపోర్ట్‌లు విద్యార్థులకు అందించే ఛాన్స్ ఉంది. అదే విధంగా పరీక్షలు అనంతరం ఏప్రిల్ 21వ తేదీ నుంచి వేసవి సెలవులు ఉంటాయి.
TS SA2 పరీక్షల టైమ్ టేబుల్ 2025 (TS SA2 Exams Time Table 2025)
తెలంగాణ రాష్ట్రంలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు TS SA 2 వార్షిక పరీక్షలు 2025 ఎప్పుడు జరుగుతాయో ఈ దిగువున పట్టికలో అంచనాగా తెలియజేశాం.
TS స్కూల్ SA 2 పరీక్షల 2025 టైమ్ టేబుల్ విడుదలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ షెడ్యూల్‌లను ప్లాన్ చేసుకోవచ్చు. పరీక్షలకు తగినంతగా ప్రిపేర్ కావచ్చు. సాధారణంగా పరీక్షలు ప్రారంభానికి చాలా వారాల ముందు టైమ్ టేబుల్ ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి వస్తుంది.దీనివల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు సిద్ధం కావడానికి తగినంత సమయం లభిస్తుంది. SA 2 పరీక్షల టైమ్ టేబుల్‌ను సాధారణంగా తెలంగాణలో విద్యా శాఖ విడుదల చేస్తుంది.