స్కూల్ విద్యార్థుల కోసం ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 13 February 2025)
13 ఫిబ్రవరి 2025న పాఠశాల అసెంబ్లీలో వార్తల పఠన కార్యకలాపాలకు సంబంధించిన పాఠశాల అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలను ఇక్కడ చెక్ చేయవచ్చు.

Follow us
13 ఫిబ్రవరి 2025న పాఠశాల అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 13 February 2025) : ఫిబ్రవరి 13న పాఠశాల అసెంబ్లీ వార్తల పఠన కార్యకలాపంలో పాల్గొనే విద్యార్థులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల ముఖ్యాంశాలను ఇక్కడ చూడవచ్చు.
13 ఫిబ్రవరి 2025న స్కూల్ అసెంబ్లీకి సంబంధించిన AP వార్తల ముఖ్యాంశాలు (AP News Headlines for School Assembly 13 February 2025)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేరళలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేరళ, తమిళనాడులోని పలు ఆలయాలను పవన్ కల్యాణ్ సందర్శించారు. ఇందులో భాగంగా కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
విజయవాడ నగరంలో సితార సెంటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమిక అంచనా.
పల్నాడు జిల్లాలో వెల్దుర్తి మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో పులులు సంచారం పెరిగింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.
13 ఫిబ్రవరి 2025న స్కూల్ అసెంబ్లీకి సంబంధించిన తెలంగాణ వార్తల ముఖ్యాంశాలు (Telangana News Headlines for School Assembly 13 February 2025)
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు. తమ డిమాండ్ నెరవేర్చక పోతే యుద్ధం తప్పదని హెచ్చరించారు.
తెలంగాణలో మేడారం సమ్మక్క,సారమ్మల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతరకి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈనెల 15 వరకు జాతర కొనసాగనుంది.
పదో తరగతి పరీక్షలపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు శాంపిల్ ఓఎంఆర్ పత్రాలను అందించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఈ మేరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ప్రీ ఫైనల్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఓఎంఆర్ పత్రాలపై అవగాహణ కల్పించనున్నారు.
స్కూల్ అసెంబ్లీకి సంబంధించిన జాతీయ వార్తల ముఖ్యాంశాలు 13 ఫిబ్రవరి 2025 (National News Headlines for School Assembly 13 February 2025)
13 ఫిబ్రవరి 2025న పాఠశాల అసెంబ్లీకి సంబంధించిన జాతీయ వార్తల ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి.
ప్రధాని నరేంద్రమోదీ ఫ్రెంచ్ ఓడరేవు నగరం మార్సెయిల్‌కు చేరుకుని వీడీ సావర్కర్‌ను ప్రశంసించారు.
ఈవీఎంల డేటాను ధ్రువీకరిస్తున్నప్పుడు వాటిని తొలగించవద్దని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
రాజస్థాన్ పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసేలా వీడియోను ప్రదర్శించినందుకు ఎల్విష్ యాదవ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
జమ్మూలోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) సమీపంలో జరిగిన ఐఈడీ పేలుడులో మరణించిన ఇద్దరు ఆర్మీ సిబ్బందిలో ఒక అధికారి కూడా ఉన్నారు.
మహారాష్ట్రను తాకిన బర్డ్ ఫ్లూ కారణంగా 7,000 కు పైగా కోళ్లను చంపి, 2,230 గుడ్లు ధ్వంసం చేశారు.