ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ 2025 (India Post recruitment 2025 apply online) : పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ప్రకటన ద్వారా గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనుంది. వివిధ రాష్ట్రాల్లో మొత్తం 21,413 పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.inలో ప్రారంభమైంది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థఉలు దరఖాస్తు (India Post recruitment 2025 apply online) చేసుకోవడానికి చివరి తేదీ 3 మార్చి 2025.
ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీల వివరాలు (India Post GDS Recruitment 2025 Vacancies Details)
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21,413 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులు ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈశాన్య, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌తో సహా బహుళ రాష్ట్రాలను కవర్ చేస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. తర్వాత తమిళనాడులో ఉన్నాయి.
ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు (India Post GDS Recruitment 2025 Important Dates)
ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలు ఇక్కడ అందించాం. ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అందించాం.
ఇండియా పోస్ట్ ఆఫీస్ GDS అర్హత ప్రమాణాలు 2025 (India Post Office GDS Eligibility Criteria 2025)
పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా అవసరమైన అర్హత ప్రమాణాలను (విద్యా అర్హత, వయో పరిమితి) కలిగి ఉండాలి. ఆ అర్హత ప్రమాణాల గురించి ఈ దిగువున అందించాం.
- భారత ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వాలు/భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల్లో గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాల్లో 10వ తరగతి సెకండరీ స్కూల్ పరీక్ష పాస్ అయి ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయస్సులో మినహాయింపు ఉంటుంది.
ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ జీతతాలు 2025 (India Post GDS Salary 2025)
ఇండియా పోస్ట్ తయారుచేసిన మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థులను గ్రామీణ డాక్ సేవకులు (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టులకు ఎంపిక చేస్తారు. నియమించబడిన అభ్యర్థులకు చేసిన పనికి ప్రతిఫలంగా నెలవారీ జీతం అందిస్తారు. GDS/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జీతం రూ. 10,000 నుంచి రూ. 24,470/- వరకు ఉంటుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జీతం రూ. 12,000/- నుంచి రూ. 29,380/- వరకు ఉంటుంది. ప్రాథమిక వేతనంతో పాటు అభ్యర్థులకు వివిధ అలవెన్సులు, ప్రోత్సాహకాలు చెల్లించబడతాయి...