ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట డౌన్‌లోడ్ 2025 (APPSC Group 2 Mains Hall Ticket Download 2025) : ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ హాల్ టికెట్లను రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 13 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని APPSC తెలిపింది. ఈ పరీక్ష ఫిబ్రవరి 23న జరగనుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు 13 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు కమిషన్ వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్షలో పాసైన వేలాది మంది అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్స్‌కు హాజరవుతారు. APPSC గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్ 2025
(APPSC Group 2 Mains Hall Ticket Download 2025) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు చాలా ముఖ్యమైనది.
APPSC గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్ వెబ్‌నోట్ (APPSC Group 2 Mains Hall Ticket 2025 Webnote)
APPSC గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ చేసుకునే విధానం (Steps to Download APPSC Group 2 Mains Hall Ticket 2025)
ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని చూస్తున్న అభ్యర్థులు ఈ దిగువ పేర్కొన్న విధానాన్ని అనుసరించవచ్చు.
స్టెప్ 1: APPSC అధికారిక వెబ్‌సైట్ https://portal-psc.ap.gov.in/ని సందర్శించాలి.
స్టెప్ 2: హోంపేజీలో APPSC గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ కోసం చెక్ చేయాలి. లేదా హాల్ టికెట్ విభాగంపై క్లిక్ చేయండి. మీరు కొత్త వెబ్ పేజీకి రీడైరక్ట్ అవుతుంది.
స్టెప్ 3: హాల్ టికెట్‌ని వీక్షించడానికి మీ OTPR ID, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
స్టెప్ 4: APPSC గ్రూప్ 2 మెయిన్స్ అడ్మిట్ కార్డ్ కోసం చెక్ చేసి, డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 5: భవిష్యత్ ఉపయోగం కోసం మీ APPSC గ్రూప్ 2 మెయిన్స్ అడ్మిట్ కార్డ్ ప్రింట్ తీసుకోవాలి.
APPSC గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్ 2025లో ఉండే వివరాలు (Details Mentioned in APPSC Group 2 Mains Hall Ticket 2025)
అభ్యర్థులు APPSC గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో పేర్కొన్న వివరాలను చెక్ చేసి, వారి అభ్యర్థిత్వాన్ని నిర్ధారించుకోవాలి.
- అభ్యర్థి ఫోటో
- అభ్యర్థి సంతకం
- రోల్ నెంబర్
- రిజిస్ట్రేషన్ నెంబర్
- పరీక్షా స్థలం
- పరీక్ష తేదీ
- రిపోర్టింగ్ సమయం
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం
https://telugunews.collegedekho.com/ ఈ లింక్‌పై క్లిక్ చేయడి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. తాజా విశేషాలను, వివరాలను ఇక్కడ చూడండి.