SSC CGL 2025 టైర్ 2 పరీక్షా ఫలితాలు విడుదల తేదీ(SSC CGL 2025 Tier 2 Exam Results Expected Date) : కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష, SSC CGL టైర్ 2 ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC త్వరలో విడుదల చేస్తుంది. ఈ పరీక్ష జనవరి 18 నుంచి జనవరి 20న జరిగింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 17,727 పోస్టులను భర్తీ చేయనున్నారు. టైర్ 1 పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే టైర్ 2 పరీక్ష రాయడానికి అర్హులవుతారు. SSC CGL టైర్ 2 అనేది ఆబ్జెక్టివ్ టైప్ పేపర్. ఈ పేపర్‌లో అర్హత సాధించడానికి, అన్ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 30 శాతం, OBC/ EWS అభ్యర్థులు 25 శాతం, ఇతరులకు 20 శాతం మార్కులు అవసరం. SSC CGL టైర్ 2 ఫలితాలు 2025 (SSC CGL 2025 Tier 2 Exam Results Expected Date) ఈ వారం ఆన్‌లైన్‌లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది.
SSC CGL టైర్ II పరీక్ష 2025 ఫలితాలను ఎలా చెక్ చేయాలి? (SSC CGL Tier II Exam 2025: How to Check Result)
SSC CGL టైర్ II పరీక్ష 2025 ఫలితాలను (SSC CGL 2025 Tier 2 Exam Results Expected Date) ఈ దిగువున తెలిపిన విధంగా చెక్ చేసుకోండి.
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in కి వెళ్లాలి.
- హోంపేజీలో తాజా వార్తల విభాగం అనే ఆప్షన్2ని చూడాలి.
- SSC CGL టైర్ 2 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి.
- మెరిట్ జాబితా తెరుచుకుంటుంది
- మీ రోల్ నెంబర్‌ను తెలుసుకోవడానికి CTRL+F ఉపయోగించాలి.
- భవిష్యత్ సూచనల కోసం మెరిట్ జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
SSC CGL టైర్ 2 ఆన్సర్ కీ జనవరి 21న విడుదలైంది. అభ్యంతరాల విండో జనవరి 24న ముగిసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసే ముందు అభ్యంతరాలను అధికారులు సమీక్షిస్తారు. ఆన్సర్ కీని సవాలు చేయాలనుకునే అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.100లు చెల్లించాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం
https://telugunews.collegedekho.com/ ఈ లింక్‌పై క్లిక్ చేయడి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. తాజా విశేషాలను, వివరాలను ఇక్కడ చూడండి.