స్కూల్ విద్యార్థులకు శుభవార్త, బడులు ప్రారంభం రోజునే ఫ్రీగా పుస్తకాల పంపిణీ (School Free Text Books Printing Start 2025 in AP)
ఏపీలో పాఠశాలలకు ఉచిత పుస్తకాల ప్రింటింగ్ ఏర్పాట్లు మొదలయ్యాయి. పాఠశాలల్లో చేరే రోజునే పుస్తకాలను అందించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.

Follow us
ఏపీలో పాఠశాలల ఉచిత పుస్తకాల ప్రింటింగ్‌కు ఏర్పాట్లు (School Free Text Books Printing Start 2025 in AP): ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల విద్యార్థులకు ఒక గుడ్‌న్యూస్. అది ఏమిటంటే.. ఇక నుంచి పాఠశాలలు ప్రారంభమైన రోజునే ఉచితంగా పుస్తకాలను (School Free Text Books Printing Start 2025 in AP) అందించేందుకు కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఒకటో తరగతి నుంచి 5వ తరగతులకు సంబంధించిన పుస్తకాల ప్రింటింగ్‌కు విద్యాశాఖ తాజా ప్రారంభించింది. దీని కోసం టెండర్లను కూడా పిలిచింది. పేపర్ సరఫరా, ప్రింటింగ్‌కు కలిపి ఒకే టెండర్లను పిలిచింది.
పేపర్ సరఫరా, ప్రింటింగ్ కోసం టెండర్ల కోసం మూడు కంపెనీలు సెలక్ట్ అయ్యాయి. పుస్తకాల ప్రింటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 34.36 లక్షల మందికి బుక్స్ అందించేందుకు 15 వేల మెట్రిక్ టన్నుల పేపర్ అవసరం కానున్నట్టు విద్యాశాక్ అంచనా వేసింది. దీనికోసం టన్ను రూ.95,50 చొప్పు కొనుగోలు చేయనుంది. ఏప్రిల్ నెల చివరి నాటికి పిల్లల కోసం పాఠ్యపుస్తకాలను జిల్లా కేంద్రాలకు తరలించి, మే నెల చివరి నాటికి పాఠశాలలకు చేర్చాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంది. మరోవైపు విద్యాశాఖ పాఠ్యపుస్తకాల మోత బారం తగ్గడానికి కూడా చర్యలు తీసుకుంటుంది.
పాఠ్యపుస్తకాలను సరళీకరించే ప్రణాళిక
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల భారాన్ని తగ్గించడానికి పాఠశాల విద్యా శాఖ ఒక ప్రణాళికను కూడా రూపొందించింది. ఇందులో భాగంగా అన్ని సబ్జెక్టులను ఒకే పాఠ్యపుస్తకంగా ఏకీకృతం చేయడం, సెమిస్టర్ వారీగా నిర్వహించడం జరుగుతుంది. మొదటి సెమిస్టర్‌లో 1, 2 తరగతులకు సంబంధించిన అన్ని సబ్జెక్టులను అదనపు వర్క్‌బుక్‌తో పాటు ఒక పాఠ్యపుస్తకంగా కలపనున్నారు. రెండో సెమిస్టర్‌లో అన్ని సబ్జెక్టులను మళ్లీ ఒక వర్క్‌బుక్‌తో పాటు ఒక పాఠ్యపుస్తకంలో కలపనున్నారు.
మూడు, ఐదు తరగతులకు మొదటి సెమిస్టర్‌లో అన్ని లాంగ్వేజ్ విషయాలను ఒక పాఠ్యపుస్తకం, వర్క్‌బుక్‌గా కలుపుతారు. మిగిలిన అన్ని విషయాలను ప్రత్యేక పాఠ్యపుస్తకం, వర్క్‌బుక్‌గా వర్గీకరిస్తారు. 9, 10 తరగతులకు ప్రస్తుత హిందీ పాఠ్యపుస్తకం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) తయారుచేసిన పాత వెర్షన్‌తో భర్తీ చేయబడుతుంది. 9, 10 తరగతులకు ప్రస్తుత హిందీ పాఠ్యపుస్తకం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) తయారుచేసిన పాత వెర్షన్‌తో భర్తీ చేయబడుతుంది.
అదే విధంగా అనుమతి లేకుండా గైర్హాజరయ్యే ఉపాధ్యాయుల నుంచి పాయింట్లను తీసివేయడానికి ఒక వ్యవస్థ అమలవుతుంది. బదిలీల సమయంలో అనధికారికంగా గైర్హాజరైతే ఉపాధ్యాయులు గరిష్టంగా 10 పాయింట్లను కోల్పోతారు, ప్రతి నెలా ఒక పాయింట్ తీసివేయబడుతుంది.