ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు 2024 విడుదల (AP 10th Class Hall Tickets 2025 Released)) : బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BSEAP) ఈరోజు అంటే మార్చి 3 ఏపీ పదో తరగతి పరీక్షల కోసం హాల్ టికెట్లను విడుదల చేసింది. నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్: bse.ap.gov.inలో యాక్సెస్ చేయవచ్చు. AP SSC హాల్ టిక్కెట్‌లను AP ప్రభుత్వ వాట్సాప్ సేవ (9552300009) మన మిత్ర నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, విద్యా సేవలను ఎంచుకుని, మీ అప్లికేషన్ నంబర్/చైల్డ్ ID మరియు పుట్టిన తేదీని అందించడం ద్వారా, రాష్ట్ర మంత్రి లోకేష్ నారా పోస్ట్‌ను పేర్కొన్నారు.
ఏపీ పదో తరగతి హాల్ టికెట్ల లింక్ 2025 (AP SSC Hall Tickets 2025)
విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్
bse.ap.gov.in ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌ని సందర్శించి హోంపేజీలో ఉన్న ‘AP SSC హాల్ టికెట్ 2025’ లింక్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ఓపెన్ అయ్యే పేజీలో అభ్యర్థి పేరు, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. తర్వాత పేజీలో హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
వాట్సాప్ ద్వారా పదో తరగతి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే విధానం (AP 10th Class Hall Tickets on Whatsapp)
వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ దిగువున ఇచ్చిన స్టెప్స్ ద్వారా హాల్ టికెట్లను పొందవచ్చు.
- విద్యార్థులు 9552300009 నెంబర్‌ను సేవ్ చేసుకుని హాయ్ (Hi) అని వాట్సాప్‌లో మెసేజ్ చేయాలి.
- మీరు మెసెజ్ చేయగానే వెంటనే సేవను ఎంచుకోండి అంటూ ఒక ఆప్షన్ వస్తుంది.
- దానిపై క్లిక్ చేయగానే కొన్ని సేవలు కనిపిస్తాయి.
- అందులో విద్యా సేవలపై క్లిక్ చేయాలి
- అందులో పరీక్ష హాల్ టికెట్ డౌన్‌లోడ్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఎస్‌ఎస్‌సీ/ టెన్త్ పరీక్షల హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది.
- దానిపై క్లిక్ చేసి పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ మీ ఫోన్‌లోనే సింపుల్‌గా పొందవచ్చు.
అన్ని హాల్‌టికెట్లలో విద్యార్థుల స్కాన్ చేసిన ఇమేజ్‌లు ఉండేలా చూసుకోవాలని పాఠశాల నిర్వాహకులను ఆదేశించారు. అడ్మిట్ కార్డ్‌లలో ఏవైనా తప్పులుంటే అడ్మిట్ కార్డ్‌లు జారీ చేసిన 10 రోజులలోపు వీటిని బోర్డుకి రిపోర్ట్ చేయాలి. 2025కి సంబంధించిన AP SSC హాల్ టికెట్ ఇప్పుడు రెగ్యులర్, ప్రైవేట్, వొకేషనల్ విద్యార్థులకు అందుబాటులో ఉంది. హాల్ టికెట్లు లేకుండా ఏ విద్యార్థి కూడా పరీక్ష హాల్లోకి అనుమతించబడరని దయచేసి గమనించండి.