ఏపీ ఒంటిపూట బడుల 2025 తేదీలు (AP Half Day Schools 2025 Dates) : ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.
ఈ ఏడాది ఒంటిపూట బడులు ఈ నెల 15 నుంచే (AP Half Day Schools 2025 Dates) ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఓ ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ రెడీ చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో ఒక పక్క పరీక్ష్లల కాలం నడుస్తుంది, అదే సమయంలో ఎండలు కూడా బాగా పెరిగాయి. దీంతో ఒంటిపూట బడుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే విడుదలకానున్నట్టు తెలుస్తుంది.
రాష్ట్రంలో ముదిరిన ఎండల నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పాఠశాలలను నిర్వహించడం జరుగుతుంది. అధికారులు ఒంటిపూట బడులపై ఉత్తర్వుల ఇచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సి పల్, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, గుర్తింపు పొందిన అన్ ఎయిడెడ్ పాఠశాలల మేనేజ్‌మెంట్‌లలో ఒంటిపూట బడులు పక్కాగా అమలు చేయాల్సి ఉంటుంది.
ఏపీలో ఒంటిపూట బడులపై ఉత్తర్వుల్లో ఆ సమయంలో పాఠశాలల యాజమాన్యాలు, సిబ్బంది, విద్యార్థులు కచ్చితంగా పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా విద్యాశాఖ ప్రకటిస్తుంది. ఈ గైడ్‌లైన్స్ ప్రతి ఏడాది ఉంటాయి. పెరిగే ఎండలకు విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ గైడ్‌లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలను ఈ దిగువున అందిస్తున్నాం.
బహిరంగ ప్రదేశాలలో లేదా చెట్ల కింద తరగతులకు వెళ్లకుండా ఉండండి మరియు ప్రతి పాఠశాలలో ఎండ దెబ్బ తగిలినప్పుడు ఉపయోగించడానికి కొన్ని ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) సాచెట్లను నిల్వ చేసుకోండి. మధ్యాహ్న భోజనంతో పాటు మజ్జిగను అందించండి, తరగతుల ముగింపులో రెండోది సరఫరా చేయబడుతుంది.
- ఒంటిపూట బడులను నిర్దేశించిన సమయాల్లో కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది.
- అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు తగినంత తాగునీరు అందుబాటులో ఉంచాలి. గ్రామ పంచాయతీ & ఆర్‌డబ్ల్యూఎస్ శాఖతో సమన్వయం చేసుకుని, అవసరమైన చోట, అవసరమైనప్పుడల్లా నీళ్లు ఉండేలా చూసుకోవాలి.
- ఎండలు నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాలలో / చెట్ల కింద తరగతులు నిర్వహించకూడదు.
- ప్రతి పాఠశాలలో, ఎండ తీవ్రత/వడదెబ్బతో బాధపడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయుల ఉపయోగం కోసం కొన్ని ఓరల్ రీ హైడ్రేషన్ సొల్యూషన్ (ORS) సాచెట్లను అందుబాటులో ఉంచుకోవాలి.
- స్థానిక సమాజం/స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో మధ్యాహ్న భోజన సమయంలో మజ్జిగను అందించాలి.
- పైన పేర్కొన్న అంశాలు బడుల్లో సరిగ్గా జరుగుతున్నాయో లేదో? ప్రధానోపాధ్యాయులు, తనిఖీ అధికారులు, ఇతర అధికారులతో నిశితంగా పర్యవేక్షించాలి. విద్యార్థులు/ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.