SSC GD కానిస్టేబుల్ ఫలితాలు 2025 (SSC GD Constable Result 2025) : SSC GD కానిస్టేబుల్ 2025 పరీక్ష ఫలితాలు (SSC GD Constable Result 2025) త్వరలో విడుదలకానున్నాయి. ఈ పరీక్ష ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఆన్‌లైన్ మోడ్‌లో ఈ పరీక్ష జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ కీ మార్చి 4, 2025 అందుబాటులోకి వచ్చింది. దీనిపై అభ్యర్థులు మార్చి 9, 2025 వరకు అభ్యంతరాలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు SSC GD కానిస్టేబుల్ 2025 పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా SSC GD 2025 ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది. ఫలితాల విడుదలతో పాటు మెరిట్ జాబితా, కటాఫ్ మార్కులు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inలో పబ్లిష్ చేయబడతాయి.
అదనంగా SSC GD ఫలితాలు సాధారణీకరించిన స్కోర్‌లపై ఆధారపడి ఉంటాయి. నిర్దిష్ట సూత్రాన్ని ఉపయోగించి లెక్కించబడతాయి. ఈ పరీక్షలో 80 ప్రశ్నలను కలిగి ఉన్న ఒక ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక్కొక్కటి 2 మార్కులు ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.
SSC GD ఫలితాలను 2025 ఎలా చెక్ చేసుకోవాలి?
ఈ దిగువున తెలిపిన విధంగా SSC GD ఫలితాలను 2025 చెక్ చేసుకోవాలి.
- ముందుగా అభ్యర్థులు ssc.gov.inని సందర్శించాలి.
- SSC GD కానిస్టేబుల్ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత స్క్రీన్‌పై PDF కనబడుతుంది.
- భవిష్యత్తు ప్రయోజనాల SSC GD ఫలితాలు 205 PDFని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
సెలక్షన్ ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీక సామర్థ్య పరీక్ష, శారీరక ప్రమాణాల పరీక్ష (PST) వైద్య డాక్యుమెంట్ల ధ్రువీకరణ ఉంటాయి. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులు పోస్టులకు అర్హతలు పొందినట్టు అవుతుంది.
SSC GD కానిస్టేబుల్ పరీక్ష 2025 అంచనా కటాఫ్ (SSC GD Constable Exam 2025 Expected Cut off)
SSC GD కానిస్టేబుల్ పరీక్ష 2025 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. అభ్యర్థుల సూచన కోసం ఇక్కడ SSC GD పరీక్షకు సంబంధించిన కటాఫ్ వివరాలు అంచనాగా అందించాం.
తెలుగులో ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం కాలేజ్ దేఖోని చూస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను ఇక్కడ పొంంది.