TSPSC గ్రూప్ 3 ఫలితాలు 2025 (TSPSC Group 3 Results 2025) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 2025 గ్రూప్ 3 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను (TSPSC Group 3 Results 2025) అధికారికంగా ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు tspsc.gov.inలో తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 1,388 ఖాళీలను భర్తీ చేయడానికి TSPSC గ్రూప్ 3 ప్రిలిమినరీ పరీక్ష 2025 నవంబర్ 17, నవంబర్ 18, 2024 తేదీలలో నిర్వహించబడింది. ఉదయం సెషన్‌తో సహా రెండు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగింది. వ్యక్తిగత స్కోర్‌లతో పాటు, అభ్యర్థులు సమీక్షించడానికి జనరల్ ర్యాంక్ జాబితా (GRL) కూడా పబ్లిష్ చేయబడింది. GRLలో అభ్యర్థుల జనరల్ ర్యాంకులు, హాల్ టికెట్ నెంబర్, పొందిన మార్కులు, లింగం, కమ్యూనిటీ, జోన్, కేటగిరీలు ఉన్నాయి.
TSPSC గ్రూప్ 3 ఫలితాలు 2025 PDF
ఈ దిగువున ఇచ్చిన TSPSC గ్రూప్ 3 ఫలితాల PDFలింక్‌పై క్లిక్ చేసి అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
TSPSC గ్రూప్ 3 2025 ఫలితాలను ఎలా చెక్ చేయాలి? (How to Check TSPSC Group 3 Result 2025?)
TSPSC గ్రూప్ 3 ఫలితాలను 2025 చెక్ చేసుకునే విధానం ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
- అధికారిక వెబ్‌సైట్‌ను tspsc.gov.in సందర్శించాలి.
- హోంపేజీలో ఉన్న ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ TGPSC ID, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
- మీ ఫలితాన్ని వీక్షించడానికి వివరాలను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్తు సూచన కోసం ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి.
అభ్యర్థులు తమ ఫలితాల్లో పేర్కొన్న వివరాలను జాగ్రత్తగా ధ్రువీకరించుకోవాలి. ఏవైనా తేడాలు ఉంటే, వారు వెంటనే TSPSC హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలి. ఈ తెలంగాణ గ్రూప్ 3 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ తదుపరి దశకు వెళ్తారు. జనరల్ ర్యాంకింగ్ జాబితా (GRL) ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన సంఖ్యలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
TSPSC గ్రూప్ 3 ఫలితాల్లో 2025 టాపర్ ఎవరంటే?
పాపన్నపేటకు చెందిన అర్జున్ రెడ్డి గ్రూప్-3 పరీక్షలో 339.239 మార్కులతో అగ్రస్థానంలో నిలిచాడు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ఇంజనీరింగ్ పట్టా పొందిన అర్జున్ రెడ్డి, హవేలి ఘన్‌పూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన మెదక్‌లోని కలెక్టర్ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది.