డైలీ కరెంట్ అఫైర్స్ 28 ఫిబ్రవరి 2025 : ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీ పోటీ పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు ఇతర పరీక్షల కోసం వివరంగా చూడవచ్చు.
డైలీ కరెంట్ అఫైర్స్ 28 ఫిబ్రవరి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affairs in Telugu 28 February 2025: National and International)
- ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే.
- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన గోల్డ్ కార్డు పధకం రెండు వారాల్లో అమల్లోకి రానున్నది.
- UDAN యాత్రి కేఫ్ ను చెన్నై ఎయిర్ పోర్ట్ లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన నాయుడు ప్రారంభించారు.
- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) బ్లూ వీసా వ్యవస్థ యొక్క మొదటి దశను ప్రవేశపెట్టింది, ఇది పర్యావరణ స్థిరత్వానికి దోహదపడే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని 10 సంవత్సరాల నివాస అనుమతి. ఫిబ్రవరి 11 నుండి 13 వరకు దుబాయ్‌లో జరిగిన ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ 2025 సందర్భంగా ప్రకటించబడింది.
- ICC ఛాంపియన్స్ ట్రోఫి లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా ఆఫ్గనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జర్దాన్ (177 రన్స్ ) నిలిచాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డు సాధించాడు.
- రైలు ప్రమాదాలను నియంత్రించడానికి దక్షిణ మధ్య రైల్వే తొలిసారిగా ఆధునిక సాంకేతిక రూపొందించిన ఆర్బీ - 19 రూపొందించారు.
- పంజాబ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో బోర్డు తో సంబంధం లేకుండా పంజాబీ సబ్జెక్టును తప్పనిసరి చేశారు. ఈ నియమాన్ని ఉల్లంగిస్తే 50,000 రూపాయలు జరిమానా విధిస్తారు.
- ముత్తూట్ ఫైనాన్స్ 115 కొత్త శాఖలను తెరవడానికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఎడ్యుకేషనల్ మరియు రిక్రూట్మెంట్ న్యూస్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.