డైలీ కరెంట్ అఫైర్స్ 25 ఫిబ్రవరి 2025 : ఫిబ్రవరి 25వ తేదీన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీ పోటీ పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు ఇతర పరీక్షల కోసం వివరంగా చూడవచ్చు.
డైలీ కరెంట్ అఫైర్స్ 25 ఫిబ్రవరి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affairs in Telugu 25 February 2025: National and International)
- ప్రపంచబ్యాంక్ నివేదిక ప్రకారం ప్రపంచదేశాల్లో కస్టమ్ మరియు ఇంపోర్ట్ సుంకాలు భారతదేశంలోనే అత్యధికంగా ఉన్నాయి.
- ఐక్యరాజ్యసమితి మహిళా శాంతి పరిరక్షణ సదస్సు ఫిబ్రవరి 24వ తేదీన ఢిల్లీ లో ప్రారంభమైంది.
- పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత తొలిసారిగా వాణిజ్య సంబంధాలను ఏర్పరుచుకున్నాయి, 50 వేల టన్నుల బియ్యం నౌక కరాచీ నుండి బంగ్లాదేశ్ కి బయలుదేరింది.
- అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం 96వ సదస్సు ఫిబ్రవరి 21 నుండి 23 వరకు న్యూఢిల్లీ లో జరిగింది, ఈ సదస్సుని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
- ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ సయింటిస్ట్ ప్రోగ్రాం ను మే 19 నుండి 30 వరకు నిర్వహించనుంది.
- నేషనల్ పారా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ 23వసారి చెన్నైలో నిర్వహించారు.
- దేశంలో తోలి బయో బ్యాంక్ ను వెస్ట్ బెంగాల్ లో ఏర్పాటు చేశారు.
- బీహార్ లోని భాగల్ పూర్ నుండి ప్రధాన మంత్రి PM-KISAN 19వ విడత నిధులను విడుదల చేశారు.
- ఆర్థిక అక్షరాస్యత - మహిళల శ్రేయస్సు అనే అంశం మీద RBI వారోత్సవాలను ప్రారంభించింది.
- చైనా దేశంలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ లో కొత్త రకం కరోనా వైరస్ కనుగొన్నారు, HKU5-CoV-2 అనే వైరస్ వారి అధ్యయనాల్లో బయటపడింది.
- భారతదేశం జైపూర్ లో 3R & సర్క్యులర్ ఎకనామీ కాన్ఫరెన్స్ కు ఆతిధ్యం ఇవ్వబోతుంది.
- RTI ప్రకారం భారతదేశంలో 60% మంది ఓటర్లు ఆధార్ కార్డుని ఓటర్ కార్డుతో లింక్ చేసుకున్నట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఎడ్యుకేషనల్ మరియు రిక్రూట్మెంట్ న్యూస్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.