TSPSC గ్రూప్ 2 ఫలితాలు 2025 (Telangana Group 2 Results 2025) : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)
ఈరోజు అంటే మార్చి 11, 2025న గ్రూప్ 2 ఫలితాలను ప్రకటించనుంది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను (Telangana Group 2 Results 2025) అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో చెక్ చేయవచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే ఇక్కడ డైరక్ట్ లింక్‌ని అందిస్తాం. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 783 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. TSPSC గ్రూప్ 2 పరీక్షలను నాలుగు సెషన్లలో నిర్వహించింది. పేపర్ 1, 2 డిసెంబర్ 15న (FN & AN) జరిగాయి. కాగా, పేపర్ 3, 4 డిసెంబర్ 16, 2025న (FN & AN) రాష్ట్రంలోని 33 జిల్లాలు 1368 పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడ్డాయి. అన్ని ప్రశ్నపత్రాలు, మాస్టర్ ప్రశ్నపత్రాల ప్రొవిజనల్ ఆన్సర్ కీలు జనవరిలో జారీ చేయబడ్డాయి. దీనిపై అభ్యర్థులు జనవరి 18 నుంచి 22, 2025 మధ్య అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం కూడా కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈరాత పరీక్షలకు మొత్తం 2,51,486 మంది అభ్యర్థులు హాజరయ్యారు
TSPSC గ్రూప్ 2 ర్యాంకింగ్ లిస్ట్ 2025 (TSPSC Group 2 Ranking List 2025 PDF)
తెలంగాణ గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కోసం ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.
ఇంతలో 563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు TSPSC గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించబడ్డాయి. అసంతృప్తి చెందిన అభ్యర్థులు మార్చి 10 నుండి 24, 2025 వరకు సాయంత్రం 5.00 గంటల వరకు అంటే 15 రోజుల పాటు TGPSC పోర్టల్‌లో మార్కుల రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
TSPSC గ్రూప్ 2 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check TSPSC Group 2 Results)
TSPSC గ్రూప్ 2 ఫలితాలను ఈ దిగువున తెలిపిన విధంగా చెక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను tspsc.gov.in సందర్శించాలి.
- హోంపేజీలో ఉన్న TSPSC గ్రూప్ 2 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో లాగిన్ వివరాలను అందించాలి.
- TSPSC గ్రూప్ 2 ఫలితం 2025 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఫలితాల PDFని చూసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- భవిష్యత్తు సూచన కోసం దీనిని ప్రింట్ తీసుకుని భద్రంగా దగ్గర ఉంచుకోవాలి.
తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలు 2025 PDF ఫార్మాట్‌లో విడుదల చేయబడతాయి. ఫలితాల్లో హాల్ టికెట్ నెంబర్లు, స్కోర్ చేసిన మార్కులు, అర్హత సాధించిన అభ్యర్థుల ర్యాంకింగ్‌లు ఉంటాయి. ఈ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ రౌండ్‌లో పాల్గొంటారు. సెలక్షన్ ప్రాసెస్‌లో ఇది చివరి దశ.