డైలీ కరెంట్ అఫైర్స్ 06 మార్చి 2025 : మార్చి 6వ తేదీన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీ పోటీ పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు ఇతర పరీక్షల కోసం వివరంగా చూడవచ్చు.
డైలీ కరెంట్ అఫైర్స్ 06 మార్చి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affairs in Telugu 06 March 2025: National and International)
- సొన్ ప్రయాగ్ నుండి కేదార్ నాథ్ ఆలయానికి రోప్ వే నిర్మించడానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే గోవింద ఘాట్ నుండి హేమకుండ్ సాహిబ్ కు మరో రోప్ వే నిర్మించడానికి కూడా ఆమోదం లభించింది.
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కార్య నిర్వహణ అధికారిగా డా. అజిత్ రత్నాకర్ నియమించబడ్డారు.
- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు, నార్వేకు చెందిన ఇద్దరు ఎంపీలు ట్రంప్ ను నామినేట్ చేసారు.
- ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు స్టీవెన్ స్మిత్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
- రాష్ట్రపతి భవన్ లో "వివిధతా కా అమృత్ మహోత్సవ్" నిర్వహిస్తున్నారు, చేనేత కారులు , చేతివృత్తి ఉత్పత్తులను ఇందులో ప్రదర్శించారు. దక్షిణ భారతదేశం లోని రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
- దివ్యాంగుల కోసం జాతీయ క్రీడా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. దక్షిణ భారతదేశంలో దివ్యాంగుల కోసం ఇది రెండవ క్రీడా కేంద్రం.
- భారత న్యాయశాఖ కార్యదర్శిగా అంజు రాఠి రాణా నియమించబడ్డారు, న్యాయశాఖ కార్యదర్శిగా నియమించబడ్డ మొదటి మహిళగా ఆమె చరిత్రలో నిలవనున్నారు.
- 97వ ఆస్కార్ అవార్డుల రేసులో ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ అవార్డు గెలుచుకున్నారు, ది బ్రుటలిస్ట్ సినిమాకు గాను ఆయన ఈ అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్ ( అనోరా చిత్రం), ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ ( అనోరా చిత్రం)
ఇవి కూడా చదవండి
మరిన్ని ఎడ్యుకేషనల్ మరియు రిక్రూట్మెంట్ న్యూస్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.