డైలీ కరెంట్ అఫైర్స్ 24 ఫిబ్రవరి 2025 : ఫిబ్రవరి 24వ తేదీన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీ పోటీ పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు ఇతర పరీక్షల కోసం వివరంగా చూడవచ్చు.
డైలీ కరెంట్ అఫైర్స్ 24 ఫిబ్రవరి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affairs in Telugu 24 February 2025: National and International)
- భారత్ - బాంగ్లాదేశ్ సరిహద్దు బలగాల మధ్యలో "హాట్ లైన్" ఏర్పాటు చేయడానికి రెండు దేశాలు అంగీకరించాయి. 4096 కిలోమీటర్ల సరిహద్దులో కంచె ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు.
- OPEC+ ( ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్పోర్టింగ్ కంట్రీస్) కూటమిలో బ్రెజిల్ కు సభ్యత్వం లభించింది. అందులో 12 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.
- nPROUD (న్యూ ప్రోగ్రాం ఫర్ రిమూవల్ ఆఫ్ అన్ యూజుడ్ డ్రగ్స్) ప్రాజెక్టును కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఫిబ్రవరి 22న కోజికోడ్ లో ప్రారంభించారు.
- ఢిల్లీలోని మౌసమ్ భవన్ లో భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియాన్ని ప్రారంభించారు. భారత వాతావరణ శాఖ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దీనిని ప్రారంభించారు.
- భారతదేశ GDP 2024-25 ఆర్థిక సంవత్సరానికి 6.2 నుండి 6.3 శాతమే వృద్ధి చెందుతుందని SBI రీసెర్చ్ సంస్థ వెల్లడించింది.
- ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత దాస్ నియమితులయ్యారు.
- ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఒకేరోజులో 20 లక్షల మందికి గృహ మంజూరు లేఖలను పంపిణీ చేసే కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. మహారాష్ట్ర సియం దేవేంద్ర ఫడ్నవీస్ , ఉప ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండే పాల్గొన్నారు.
- వరల్డ్ మెమొరీ లీగ్ ఛాంపియన్ షిప్ 2025లో భారత విద్యార్థి విశ్వ రాజ కుమార్ మొదటి స్థానంలో విజయం సాధించాడు.
- భారత్ స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 51వ వన్డే ఇంటర్నేషనల్ సెంచరీ నమోదు చేసాడు , అత్యంత వేగంగా 14000 పరుగులు సాధించిన క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు.
- ఖజురహోలో 139 మంది నృత్య కళాకారులూ 24 గంటల పాటు చేసిన శాస్తీయ నృత్యానికి గిన్నెస్ బుక్ లో చోటు దక్కింది. కథక్, కూచిపూడి , భరతనాట్యం , మోహినీ అట్టం , ఒడిస్సీ నృత్య రీతులను వీరు ప్రదర్శించారు.