నీట్ ఎండీఎస్ అప్లికేషన్ కరెక్షన్ విండో 2025 (NEET MDS Application Correction Window 2025) : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) NEET MDS 2025 అప్లికేషన్ కరెక్షన్ ప్రక్రియను ఈరోజు అంటే మార్చి 17న ముగించనుంది. అభ్యర్థులు గడువుకు ముందే అధికారిక వెబ్‌సైట్ natboard.edu.inని సందర్శించి అప్లికేషన్‌లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. మార్చి 27వ తేదీ నుంచి 31 వరకు తుది దిద్దుబాటు విండో అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థుల ఫోటోలు, స్కాన్ చేసిన డాక్యుమెంట్లు, బొటనవేలు ముద్రలు వంటి దిద్దుబాట్లు అవసరమైన ఏవైనా ఫోటోలను తిరిగి అప్‌లోడ్ చేయవచ్చు.
NEET MDS 2025 పరీక్ష ఏప్రిల్ 19న జరగనుంది. అడ్మిట్ కార్డులు ఏప్రిల్ 15న విడుదల చేయబడతాయి. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. ఫలితాలు మే 19న ప్రకటించబడతాయి. పరీక్షకు అర్హత సాధించడానికి, అభ్యర్థులు మార్చి 31, 2025లోపు తమ ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాలి.
NEET MDS 2025 అప్లికేషన్‌లో మార్చగలిగే వివరాలు (Details that can be changed in NEET MDS 2025 application)
అభ్యర్థులు అప్లికేషన్‌లో ఈ కింద తెలిపిన ఫీల్డ్‌లకు దిద్దుబాట్లు చేసుకోవచ్చు.
- కేటగిరి
- జెండర్
- పుట్టిన తేదీ
- ఫీడబ్ల్యూడీ (వికలాంగులు) స్థితి
- ఆర్థికంగా బలహీన వర్గాల స్థితి (EWS)
- కేటగిరీ లేదా ఫీడబ్ల్యూడీ స్థితిలో మార్పులు చేస్తే, అదనపు ఫీజు అవసరం కావచ్చు.
మార్చలేని వివరాలు
ఈ కింది వివరాలని సవరించలేని అంశాలు ఇవి..
- పేరు
- ఈమెయిల్ ఐడీ
- ఫోన్ నెంబర్
- జాతీయత
- పరీక్ష నగర ప్రాధాన్యతలు
NEET MDS 2025 అప్లికేషన్‌ని ఎలా ఎడిట్ చేసుకోవాలి?
NEET MDS 2025 అప్లికేషన్‌లో వివరాలను ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ దిగువున వివరంగా అందించాం. అభ్యర్థులు ఈ స్టెప్స్‌ని ఫాలో అయి దరఖాస్తులో వివరాలను సవరించుకోవచ్చు.
- ముందుగా అభ్యర్థులు natboard.edu.inకు వెళ్లాలి.
- మీ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
- NEET MDS 2025 ఎడిట్ విండోపై క్లిక్ చేయాలి.
- మీ NEET MDS 2025 దరఖాస్తును ఓపెన్ చేయాలి.
- అవసరమైన మార్పులు చేయాలి.
- అవసరమైతే అప్లికేషన్ దిద్దుబాటు ఫీజు చెల్లించాలి. .
- సేవ్ చేసి సమర్పించు క్లిక్ చేయండి.
- భవిష్యత్తు సూచన కోసం నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని లేదా స్క్రీన్‌షాట్ తీసుకోవాలి.
- తుది అప్లికేషన్‌ని నమోదు చేసే ముందు అభ్యర్థులు తమ వివరాలను జాగ్రత్తగా సమీక్షించుకోవాలి.