జేఈఈ మెయిన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2025 (JEE Main Session 2 City Intimation Slip 2025) : NTA మార్చి రెండో వారంలో JEE మెయిన్స్ 2025 సెషన్ 2 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను (JEE Main Session 2 City Intimation Slip 2025) విడుదల చేయనుంది. మార్చి 18న JEE మెయిన్ సెషన్ 2 పరీక్ష సిటీ స్లిప్ 2025 విడుదలయ్యే అవకాశం ఉంది. JEE మెయిన్ 2025 పరీక్ష సిటీ స్లిప్ సెషన్ 2 డౌన్‌లోడ్ లింక్ jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న JEE మెయిన్స్ లాగిన్ 2025ని ఉపయోగించాలి. అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి JEE మెయిన్ సెషన్ 2 పరీక్ష సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2025ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
NTA JEE మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షను ఏప్రిల్ 2న ప్రారంభిస్తుంది. ఈ పరీక్ష కౌంటీ అంతటా వివిధ నగరాల్లో మరియు భారతదేశం వెలుపల 15 నగరాల్లో నిర్వహించబడుతుంది. JEE మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్ 2025 పరీక్ష తేదీకి 3 రోజుల ముందు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. NTA అధికారిక వెబ్‌సైట్‌లో JEE మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2025 డౌన్‌లోడ్ లింక్‌ను యాక్టివేట్ చేస్తుంది.
JEE మెయిన్ సెషన్ 2 సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2025ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి (How to Download JEE Main City Intimation Slip 2025 Session 2)
సిటి ఇంటిమేషన్ స్లిప్ విడుదలైన తర్వాత అభ్యర్థులు JEE మెయిన్ 2025 పరీక్ష సిటీ స్లిప్‌లను jeemain.nta.nic.in లో చెక్ చేయవచ్చు అభ్యర్థులు ఈ దిగువున పేర్కొన్న దశలను ఉపయోగించి పరీక్ష సిటీ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ముందుగా అభ్యర్థులు JEE మెయిన్ అధికారిక వెబ్‌సైట్‌ను jeemain.nta.nic.in సందర్శించాలి.
- హోంపేజీలో JEE మెయిన్ 2025 సెషన్ 2 అడ్వాన్స్ సిటీ అలాట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
- సిటి ఇంటిమేషన్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
- డౌన్‌లోడ్ చేసుకుని దాని ప్రింట్ తసీుకుని దగ్గర పెట్టుకోవాలి.
JEE మెయిన్ సెషన్ 2 సిటీ స్లిప్ 2025లో అభ్యర్థి పరీక్షా నగరం, పరీక్ష తేదీ గురించి వివరాలు ఉంటాయి . ఇది అభ్యర్థులు పరీక్ష రోజున పరీక్షా కేంద్రానికి తమ ప్రయాణ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2025 రెండో సెషన్‌ను ఏప్రిల్ 2, 3, 4, 7, 8, 9 తేదీల్లో నిర్వహిస్తుంది.