డైలీ కరెంట్ అఫైర్స్ 11 మార్చి 2025 : మార్చి 11వ తేదీన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీ పోటీ పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు ఇతర పరీక్షల కోసం వివరంగా చూడవచ్చు.
డైలీ కరెంట్ అఫైర్స్ 11 మార్చి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affairs in Telugu 11 March 2025: National and International)
- కెనడా దేశ ప్రధానిగా మాజీ బ్యాంకర్ మార్క్ క్యార్నీ ఎన్నిక అయ్యారు.
- ఇండియన్ ప్రీమియర్ లీగ్ కుంభకోణంలో నిందితుడైన లలిత్ మోడీ కి వనాటు పౌరసత్వం రద్దు చేశారు.
- సుప్రీం కోర్టు న్యాయమూర్తి గా జస్టిస్ జాయ్ మాల్య నియమించబడ్డారు.
- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ ఘనవిజయం సాధించింది.
- ఆసియా మరియు ఆఫ్రికా ఖండాల్లో పోలియా కేసులలో పెరుగుదల ఉన్నట్లు WHO వెల్లడించింది.
- కరోనా సంక్షోభం తర్వాత అత్యిధికంగా బంగారం కొనుగోళ్లు చేసిన జాబితాలో భారత్ రెండవ స్థానంలో నిలిచింది, చైనా మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
- అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ కు కేంద్ర సాహిత్య అవార్డు లభించింది.
- అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక క్యాచ్ లు పట్టుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లీయే రికార్డు సృష్టించాడు, గతంలో రాహుల్ ద్రావిడ్ (334) పేరు మీద ఉన్న ఈ రికార్డును కోహ్లీ (336) అధిగమించాడు.
- మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాధవ్ నేషనల్ పార్కుని భారత ప్రభుత్వం 58వ టైగర్ రిజర్వ్ గా ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఎడ్యుకేషనల్ మరియు రిక్రూట్మెంట్ న్యూస్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.