డైలీ కరెంట్ అఫైర్స్ 03 మార్చి 2025 : మార్చి 3వ తేదీన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీ పోటీ పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు ఇతర పరీక్షల కోసం వివరంగా చూడవచ్చు.
డైలీ కరెంట్ అఫైర్స్ 03 మార్చి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affairs in Telugu 03 March 2025: National and International)
- శాస్త్రవేత్తలు భారతదేశంలో మరియు శ్రీలంక లో మూడు కొత్త జాతి జంతువులను కనుగొన్నారు, భారతదేశంలో రెండు రకాల జంపింగ్ స్పైడర్ లను , శ్రీలంక లో ఆకు ముక్కు గబ్బిలాలను కనుగొన్నారు.
- భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం గడిచిన 125 సంవత్సరాలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ఫిబ్రవరి నెలగా రికార్డు సాధించింది.
- చందమామ పైన సాఫ్ట్ లాండింగ్ ఘనత సాధించిన మొట్ట మొదటి ప్రైవేట్ సంస్థగా అమెరికా కు సంబంధించిన ఫైర్ ఫ్లై ఏయిరో స్పెస్ సంస్థ నిలిచింది.
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్ 3,22,359 కోట్లు రాష్ట్ర చరిత్రలో అత్యధిక బడ్జెట్ గా నమోదైంది.
- శిల్పాలు మరియు ఆధునిక కళల్లో నైపుణ్యం ఉన్న ప్రముఖ భారతీయ కళాకారుడు "హిమ్మత్ షా" మార్చి 02వ తేదీన మరణించారు.
- అంతర్జాతీయ క్రికెట్ లో 300 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ స్థానం సాధించాడు, విరాట్ కోహ్లీ కంటే ముందు ఆరుగురు ఇండియన్ ఆటగాళ్లు , 21 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు.
- భారతదేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 1వ తేదీ నుండి 15 సంవత్సరాలు కాల వ్యవధి నిండిన వాహనాలకు ఇంధన అమ్మకాలను నిలిపివేయనున్నట్లు ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి మన్ జిందర్ సింగ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఎడ్యుకేషనల్ మరియు రిక్రూట్మెంట్ న్యూస్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.