SBI PO అడ్మిట్‌కార్డ్ 2025 డౌన్‌లోడ్ లింక్ (SBI PO Admit Card 2025 Download Link) :స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 600 ఖాళీల కోసం ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO) పోస్టుల నియామకానికి ఆన్‌లైన్ ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డ్ లేదా కాల్ లెటర్‌ను ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మార్చి 08, 16, 24వ తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. అడ్మిట్ కార్డులు విడుదలైన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్స్ (POs) నియామకాల కోసం అర్హతలున్న అభ్యర్థులు bank.sbi/careers లేదా sbi.co.in/careers లోని SBI కెరీర్స్ పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.సంబంధిత డైరక్ట్ లింక్‌ని ఇక్కడ అందిస్తాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల కోసం మొత్తం 600 ఖాళీలను ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకారం UR కేటగిరీకి 240 పోస్టులు, OBCకి 158 పోస్టులు, SCకి 87 పోస్టులు మొదలైనవి విడుదల చేయబడ్డాయి.
SBI PO అడ్మిట్‌కార్డు 2025 డౌన్‌లోడ్ లింక్ (SBI PO Admit Card 2025 Download Link)
SBI PO అడ్మిట్ కార్డులను 2025 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How To Download SBI PO Admit Card 2025)
రిలీజ్ అయిన తర్వాత SBI PO ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులను ఈ దిగువున తెలిపిన విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్‌ను sbi.co.in/web/careers సందర్శించాలి.
- స్టెప్ 2: అందుబాటులో ఉన్న SBI PO అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
- స్టెప్ 4: SBI PO కాల్ లెటర్ 2025 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- స్టెప్ 5: PDFని వీక్షించాలి. డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- స్టెప్ 6: భవిష్యత్తు సూచన కోసం అడ్మిట్ కార్డును ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
SBI PO 2025 ముఖ్యామైన వివరాలు (SBI PO 2025 Highlights)
పరీక్ష గురించి వివరణాత్మక సమాచారం కోసం దిగువున ఇచ్చిన టేబుల్‌ని చూడండి.