డైలీ కరెంట్ అఫైర్స్ 04 మార్చి 2025 : మార్చి 4వ తేదీన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీ పోటీ పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు ఇతర పరీక్షల కోసం వివరంగా చూడవచ్చు.
డైలీ కరెంట్ అఫైర్స్ 04 మార్చి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affairs in Telugu 04 March 2025: National and International)
- ఆస్ట్రియా ఛాన్సలర్ గా క్రిస్టియన్ స్టాకర్ బాధ్యతలు చేపట్టారు.
- NMDC స్టీల్ కు యూరోప్ ప్రభుత్వం నుండి కన్ఫర్మిటీ యూరోపిన్నే సర్టిఫికెట్ లభించింది, NMDC స్టీల్ ఇకపై యూరప్ కు కూడా ఎగుమతి చేయవచ్చు.
- తెలంగాణ రైతు లోకసాని పద్మారెడ్డికి ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం లభించింది.
- ఫిబ్రవరి నెలకు GST ఆదాయం క్రింద తెలంగాణ రాష్ట్రానికి 5280 కోట్లు , ఆంధ్రప్రదేశ్ కు 3817 కోట్లు ఆదాయం లభించింది.
- భారతదేశంలో GST వసూళ్లు ఫిబ్రవరి నెలలో 9.1 శాతం వృద్ధి సాధించాయి.
- ఐపీల్ 2025 లో కోల్కతా జట్టుకు కెప్టెన్ గా అజింక్య రహానే ను ఎంపిక చేశారు.
- ఉరుగ్వే దేశ అధ్యక్షుడిగా యముండూ ఓర్సీ ప్రమాణ స్వీకారం చేసారు.
- IRCTC మరియు IRFC సంస్థలకు నవరత్న హోదా ఇవ్వడానికి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఈ హోదా కలిగి ఉన్న సంస్థలు ప్రభుత్వ అనుమతి లేకుండా 1000 కోట్ల వరకు లేదా వాటి నికర విలువలో 15% వరకు పెట్టుబడులు పెట్టవచ్చు.
- భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గిర్ వన్యప్రాణి అభయారణ్యంలో పర్యటించారు.
- భారతదేశంలో మొదటి వరల్డ్ పీస్ సెంటర్ గురుగ్రామ్ లో ప్రారంభించబడింది.
- మధ్యప్రదేశ్ రైతులకు 5 రూపాయలకే శాశ్వత విద్యుత్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఎడ్యుకేషనల్ మరియు రిక్రూట్మెంట్ న్యూస్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.