డైలీ కరెంట్ అఫైర్స్ 27 ఫిబ్రవరి 2025 : ఫిబ్రవరి 27వ తేదీన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీ పోటీ పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు ఇతర పరీక్షల కోసం వివరంగా చూడవచ్చు.
డైలీ కరెంట్ అఫైర్స్ 27 ఫిబ్రవరి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affairs in Telugu 27 February 2025: National and International)
- అంగారక గ్రహం మీద సముద్రం ఉండేదన్న ఆనవాళ్లను చైనా దేశపు జురాంగ్ రోవర్ గుర్తించింది.
- నేషనల్ జియో స్పెషియల్ నాలెడ్జ్ బేస్డ్ - లాండ్ సర్వ్ ఆఫ్ అర్బన్ హాబిటేషన్స్ (NAKSHA) ను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రారంభించారు.
- సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అరక్కోణం ట్రైనింగ్ సెంటర్ కి రాజాదిత్య చోళన్ పేరు పెట్టారు.
- అస్సాం ప్రభుత్వం బౌద్ధ మతాన్ని అధికారిక గుర్తింపు ఇచ్చింది.
- కో- ఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ఇచ్చే రుణాలను గరిష్టంగా ఒక వ్యక్తికీ 3 కోట్ల రూపాయలకు పెంచుతూ RBI అనుమతి ఇచ్చింది.
- భారత ఒలంపిక్ సంఘం, బాక్సింగ్ ఫెడరేషన్ కోసం ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మధుకాంత్ పాఠక్ నేతృత్వం వహిస్తారు.
- దేశ్ కా ప్రకృతి పరీక్ష అభియాన్ 5 గిన్నిస్ రికార్డులను సాధించింది.
- ఆయుష్ మంత్రిత్వ శాఖ ముగ్గురు డాక్టర్లకు ధన్వంతరీ ఆయుర్వేద అవార్డులను ప్రకటించింది
- డిపార్ట్మెంట్ అఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ PAYTM తో MOU కుదుర్చుకుంది. ఇన్నోవేషన్ రంగంలో స్టార్ట్అప్ కోసం రెండు సంస్థల మధ్య MOU కుదిరింది.
- ఫిబ్రవరి 27, వినాయక్ దామోదర్ సావర్కర్ వర్థంతి, ఆయన అభినవ్ భారత్ సొసైటీ ను 1904 లో ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఎడ్యుకేషనల్ మరియు రిక్రూట్మెంట్ న్యూస్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.