డైలీ కరెంట్ అఫైర్స్ 26 ఫిబ్రవరి 2025 : ఫిబ్రవరి 26వ తేదీన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీ పోటీ పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు ఇతర పరీక్షల కోసం వివరంగా చూడవచ్చు.
డైలీ కరెంట్ అఫైర్స్ 26 ఫిబ్రవరి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affairs in Telugu 26 February 2025: National and International)
- జర్మనీ దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్ , క్రిస్టియన్ సోషల్ యూనియన్ కూటమి విజయం సాధించింది.
- ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా నియమితులయ్యారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సత్యసాయి జిల్లాలోని నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి దళవాయి శివమ్మ పరంపరాగత అవార్డు ను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నుండి అందుకున్నారు.
- తమిళ కవి, తత్వవేత్త తిరువళ్ళువర్ విగ్రహాన్ని ఫిలిప్పైన్స్ లో భారత రాయబారి హర్ష కుమార్ జైన్ ఆవిష్కరించారు.
- క్యాన్సర్ వ్యాక్సిన్ త్వరలోనే భారతదేశంలో అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు, 9 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల మధ్య వయసు వారికి ఈ టీకా వేయడం వలన క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని వెల్లడించారు.
- 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా ఈరోజుతో పూర్తి కాను న్నది.
- ఫిబ్రవరి 24వ తేదీకి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 3 సంవత్సరాలు గడిచాయి, ఈ యుద్ధంలో దాదాపు 2 లక్షలమందికి పైగా మరణించారు.
- వర్చువల్ డిజిటల్ ఆస్తుల పన్నుల విషయంలో మార్పులను ప్రకటించింది, క్రిప్టో కరెన్సీ దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపింది,
- INS గుల్దార్ (ల్యాండింగ్ షిప్ ట్యాంక్ ) భారతీయ నేవీ షిప్ ను మహారాష్ట్ర పర్యాటక శాఖ కు అప్పగించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఎడ్యుకేషనల్ మరియు రిక్రూట్మెంట్ న్యూస్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.