AP KGBV అప్లికేషన్ 2025 దరఖాస్తు తేదీ (AP KGBV Application 2025 Apply Online Date) : ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం మార్చి 22 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రోజు నుంచి దరఖాస్తు స్వీకరించనున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఏపీలోని KGBVల్లోని 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి, 11వ తరగతి ప్రవేశాల కోసం 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికలు అప్లై చేసుకోవచ్చు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ మార్చి 22 నుంచి ఏప్రిల్ 11 వరకు కొనసాగుతుంది. గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ ప్రవేశాల కోసం అందరూ అప్లై చేసుకోవడానికి అవ్వదు. కొన్ని అర్హతలున్న వాళ్లు మాత్రమే దరఖాస్తు (AP KGBV Application 2025 Apply Online Date) చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ అందించాం.
ఇది కూడా చూడండి: నవోదయ ఆరో తరతి హాల్ టికెట్లు 2025 విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీ KGBV ఆరో తరగతి అడ్మిషన్లు 2025 వివరాలు (AP KGBV 6th Class Admission 2025 Deatials)
ఏపీ కేజీబీవీ ఆరో తరగతి అడ్మిషన్ల కోసం కావాల్సిన అర్హతలు 2025 (Eligibility for AP KGBV 6th Class Admission 2025?)
AP KGBV 6వ తరగతిలో ప్రవేశాలకు 5వ తరగతి విద్యను పూర్తి చేసి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కేటగిరీల బాలికలు మాత్రమే అర్హులు. బాలికలకు కావాల్సిన అర్హత ప్రమాణాల వివరాలను ఈ దిగువున వివరంగా అందించాం.
- బాలికలు SC, ST, OBC లేదా మైనారిటీ కేటగిరీలకు చెందినవారై ఉండాలి.
- బాలికల వయస్సు 10 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.1,50,000 కంటే తక్కువగా ఉండాలి.
- బాలికలు అవివాహితులై ఉండాలి.
- గతంలో KGBV పాఠశాలలో చదివి ఉండకూడదు.
- అనాథ బాలికలు కూడా అర్హులు.
AP KGBVలో అడ్మిషన్ వల్ల కలిగే ప్రయోజనాలు (AP KGBV Features and Facilities)
AP KGBVలో ప్రవేశాల వల్ల కలిగే ప్రయోజనాలు ఈ దిగువున అందించడం జరిగింది.
- AP KGBV గురుకుల పాఠశాలల్లో చేరిన బాలికలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు ఇస్తారు.
- మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తారు.
- వృత్తి విద్యలో శిక్షణ ఇస్తారు. చదువుతో పాటు, దర్జీ, ఎంబ్రాయిడరీ, నృత్యం, సంగీతంలో శిక్షణ అందిస్తారు.
- ప్రతి విద్యార్థికి లక్ష రూపాయల బీమా ఉంటుంది.
- ఉచిత భోజనం, వసతి కూడా ఉంటుంది.
- బాలికల పోషకాహారాన్ని దృష్టిలో ఉంచుకుని, పాలు, గుడ్లు, ఆకుకూరలు (ఆకు కూర) సహా అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలతో రోజువారీ భోజనం పెడతారు.
- నెలకు వంద రూపాయల చొప్పున మూడు సంవత్సరాల పాటు విద్యార్థుల ఖాతాలో ఒక మొత్తం జమ చేయబడుతుంది.