కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అడ్మిషన్ 2025-26 (Kendriya Vidyalaya Admission 2025-26 for class 1) : కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) 2025-26 సంవత్సరానికి ఒకటో తరగతి ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు మార్చి 24వ తేదీలోపు పిల్లల పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిగా అభ్యర్థులు దరఖాస్తును kvsonlineadmission.kvs.gov.inలో ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి. బాల్వటిక (స్థాయిలు 1, 2, 3) అడ్మిషన్ ప్రక్రియ కూడా మార్చి 21న రాత్రి 10 గంటలకు ముగుస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఎలా డాక్యుమెంట్లు ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలనుకునే విషయాలు ఈ దిగువున అందించడం జరిగింది.
KVS అడ్మిషన్ 2025కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు
KVS అడ్మిషన్ 2025కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్ల వివరాలను ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
- చెల్లుబాటు అయ్యే మొబైల్ నెంబర్ (ఇండియన్ సిమ్)
- ఈ మెయిల్ ఐడీ
- పిల్లల డిజిటల్ ఫోటో (JPEG, గరిష్ట పరిమాణం: 256KB)
- స్కాన్ చేసిన జనన ధ్రువీకరణ పత్రం, చిరునామా ప్రూఫ్.
- కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)
- EWS కేటగిరీకి ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)
- తల్లిదండ్రులు లేదా తాతామామల బదిలీ వివరాలు (సేవా ఆధారాల ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే).
KVS అడ్మిషన్స్ 2025 ముఖ్యమైన తేదీలు (KVS Admissions 2025 Importante Dates)
KVS అడ్మిషన్లకు సంబంధించిన 2025 ముఖ్యమైన తేదీలను ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో అందించడం జరిగింది.
KVS Admissions 2025-26కి ఎలా అప్లై చేసుకోవాలి? (How to apply for KVS Admissions 2025-26)
KVS అడ్మిషన్స్ 2025-26కి ఈ దిగువున తెలిపిన విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి kvsonlineadmission.kvs.gov.in వెళ్లాలి.
- హోంపేజీలో చెల్లుబాటయ్యే మొబైల్ నెంబర్, ఈ మెయిల్ IDతో మిమ్మల్ని మీరు నమోదు చేసుకోవాలి.
- తదుపరి దశలో ఐదు విభాగాలలో అవసరమైన వివరాలను ఇచ్చి పూరించాలి.
- వివరాలను క్రాస్-చెక్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
- భవిష్యత్ సూచనల కోసం అప్లికేషన్‌ని సబ్మిట్ చేసి దానిని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.