నవోదయ ఆరో తరగతి హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ 2025 (Navodaya 6th class Hall Ticket Download 2025) : నవోదయ ఆరో తరగతి హాల్ టికెట్లు 2025 రిలీజ్ అయ్యాయి. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ (JNVST) కోసం నవోదయ విద్యాలయ సమితి హాల్ టికెట్లను (Navodaya 6th class Hall Ticket Download 2025) విడుదల చేసింది. 6వ తరగతిలో అడ్మిషన్లు పొందాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inలో లాగిన్ ఆధారాలను నమోదు చేయడం ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష ఏప్రిల్ 12, 2025న ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఒకే షిఫ్ట్‌లో జరుగుతుంది. ప్రశ్నపత్రంలో MCQలు కలిగిన మూడు విభాగాలు ఉంటాయి. విద్యార్థులు వంద మార్కులకు 80 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
ఇది కూడా చూడండి: 22 నుంచి AP KGBVలో 6వ తరగతి అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
నవోదయ ఆరో తరగతి హాల్ టికెట్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download JNV Admit Card 2025 of 6th Class?)
అభ్యర్థులు ఆరో తరగతి హాల్ టికెట్ల PDFని (Navodaya 6th class Hall Ticket Download 2025) డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ దిగువున తెలిపిన విధానాన్ని ఫాలో అవ్వవచ్చు.
- స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్‌ను navodaya.gov.in సందర్శించాలి.
- స్టెప్ 2: హోంపేజీలో ఉన్న JNVST ఆరో తరగతి అడ్మిట్ కార్డ్ 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: లాగిన్ ఆధారాలను సబ్మిట్ చేయాలి.
- స్టెప్ 4: అనంతరం స్క్రీన్‌పై ఆరో తరగతి హాల్ టికెట్ 2025 కనిపిస్తుంది.
- స్టెప్ 5: కనిపించే హాల్ టికెట్‌ను పరిశీలించి వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- స్టెప్ 6: భవిష్యత్తు సూచన కోసం హాల్ టికెట్‌ను దగ్గర ఉంచుకోవాలి.
నవోదయ ఆరో తరగతి హాల్ టికెట్ 2025 పై ఉండే వివరాలు (Details on JNV Class 6 Admit Card 2025 PDF)
విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత కచ్చితంగా ఈ దిగువున తెలిపిన వివరాలను చెక్ చేసుకోవాలి. ఆ వివరాల్లో ఏమైనా తప్పులు, పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేయించుకోవాలి.
- విద్యార్థి పేరు
- రోల్ నెంబర్
- పరీక్ష తేదీ & సమయం
- పరీక్షా కేంద్రాల వివరాలు
- పరీక్ష రోజు పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు
5వ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ జిల్లాలో 6వ తరగతి ప్రవేశానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడ్డారు. దరఖాస్తుదారులు 01-05-2013కి ముందు 31-07-2015 తర్వాత పుట్టి ఉండకూడదు