సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.