ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠ వీడింది. ముందు షెడ్యూల్ ప్రకారమే రేపు అంటే ఫిబ్రవరి 23, 2025న పరీక్ష జరగనుంది. పేపర్-1 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతుంది. అభ్యర్థులు తమ తమ పరీక్షా కేంద్రాలకు షెడ్యూల్ చేసిన సమయానికి కనీసం 15 నిమిషాల ముందుగా చేరుకోవాలని సూచించారు. అదేవిధంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో వ్యాపించే తప్పుడు పుకార్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తోసిపుచ్చింది. అటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులను కమిషన్ కోరింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.
లేటెస్ట్ న్యూస్ : నిఘా నీడలో APPSC గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ 2025, ఇలా చేస్తే కఠిన చర్యల తప్పవన్న అధికారులు
13 జిల్లాల్లోని 175 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడే APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు 92,000 మందికి పైగా అభ్యర్థులు హాజరు కావడానికి అర్హులు. మెయిన్ పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి.
APPSC గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్ 2025 డైరెక్ట్ లింక్ (APPSC Group 2 Mains Hall Ticket 2025 Direct Link)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్ డైరెక్ట్ లింక్ ఈ దిగువున పట్టికలో అందించాం. అభ్యర్థులు ఈ లింక్‌పై క్లిక్ చేసి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
APPSC గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్ 2025 ఎలా డౌన్‌లోడ్ చేయాలి ? ( How To Download APPSC Group 2 Mains Hall Ticket 2025)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ 2025 హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ దిగువున తెలిపిన విధానాన్ని అనుసరించాలి. ఈ కింద తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అయి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను పొందవచ్చు.
- అభ్యర్థులు ఈ ఆర్టికల్లో అందించిన డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా
- APPSC అధికారిక వెబ్సైట్ psc.gov.in ఓపెన్ చేయాలి.
- గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్ అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయాలి.
- అభ్యర్థి OTPR ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఫిల్ చేయాలి.
- ఇప్పుడు హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది.
- డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
విద్యా, ఉద్యోగ సంబంధిత వార్తల కోసం
https://telugunews.collegedekho.com/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను ఇక్కడ పొందండి. మరిన్ని వార్తల కోసం ఇక్కడ చూస్తూ ఉండండి.