కేంద్రీయ విద్యాలయ సంఘటన్ రిజిస్ట్రేషన్ 2025-26 (KVS Registration 2025-26) : కేంద్రీయ విద్యాలయ సంఘటన్, KVS 2025 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. బాలవాటికల 1,2 3 ప్రవేశాల కోసం, ఒకటో తరగతి అడ్మిషన్ల కోసం రేపు అంటే మార్చి 7 నుంచి రిజిస్ట్రేషన్ (KVS Registration 2025-26) ప్రారంభమవుతుంది. ఆసక్తిగల తల్లిదండ్రులు, సంరక్షకులందరూ KVS అధికారిక వెబ్‌సైట్ kvsangathan.nic.in ద్వారా అడ్మిషన్ రౌండ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు చేసుకునే విధానం, ఇతర వివరాలను ఇక్కడ చెక్ చేయవచ్చు.
KVS అడ్మిషన్స్ 2025 వయస్సు పరిమితి (KVS Admissions 2025 Age Limit)
- ఒకటో తరగతిలో ప్రవేశానికి కనీస వయస్సు 6 సంవత్సరాలు. అన్ని తరగతులకు వయస్సు లెక్కింపు 31.03.2025 నాటికి ఉంటుంది. సీట్ల రిజర్వేషన్లు KVS అడ్మిషన్ మార్గదర్శకాలు 2025-26 ప్రకారం ఉంటాయి.
- 1, 2 & 3 తరగతుల విద్యార్థుల వయస్సు 31.03.2025 నాటికి వరుసగా 3 నుండి 4 సంవత్సరాలు, 4 నుండి 5 సంవత్సరాలు 5 నుండి 6 సంవత్సరాలు ఉండాలి.
KVS అడ్మిషన్ 2025 ముఖ్యమైన తేదీలు (KVS Admission 2025 Important Dates)
కేవీఎస్ అడ్మిషన్‌కు సంబంధించిన 2025 ముఖ్యమైన తేదీలు ఇక్కడ చూడండి.
- 2025-26 విద్యా సంవత్సరానికి కేంద్రీయ విద్యాలయాలలో రిజిస్ట్రేషన్ మార్చి 7న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.
- రిజిస్ట్రేషన్ మార్చి 21న రాత్రి 10 గంటలకు ముగుస్తుంది.
- ఎంపికైన, వెయిట్‌లిస్ట్ చేయబడిన రిజిస్టర్డ్ అభ్యర్థుల తాత్కాలిక జాబితాలు మార్చి 25న (తరగతి 1కి), బల్వాటికకు మార్చి 26న విడుదల చేయబడతాయి.
- రెండో తాత్కాలిక జాబితా ఏప్రిల్ 2, 2025న విడుదలవుతుంది.
- మూడో తాత్కాలిక జాబితా ఏప్రిల్ 7, 2025న అందుబాటులో ఉంటుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌లు (Official Websites For Applying Online)
- అడ్మిషన్ సంబంధిత వివరాలన్నింటినీ kvsangathan.nic.in/en/admission/ లో చెక్ చేయవచ్చు.
- ఒకటో తరగతికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి లింక్ kvsonlineadmission.kvs.gov.in
- బాలవాటిక ఒకటో తరగతి నుంచి మూడు తరగతుల్లో రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి లింక్ balvatika.kvs.gov.in
కేంద్రీయ అడ్మిషన్ల కోసం 2025 ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (KVS Admission 2025 - How to Apply Online?)
కేంద్రీయ అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌లో ఈ దిగువున తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా అభ్యర్థులు https://kvsangathan.nic.in వద్ద KVS అడ్మిషన్ పోర్టల్‌ను సందర్శించాలి.
- హోంపేజీలో “అడ్మిషన్ 2025-26” లింక్ కోసం చూడాలి.
- లాగిన్ ఆధారాలను రూపొందించడానికి “కొత్త రిజిస్ట్రేషన్” బటన్‌పై క్లిక్ చేసి అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
- లాగిన్ అయి దరఖాస్తును పూరించాలి. అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి.
- వివరాలను క్రాస్-చెక్ చేసి, దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
- దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి, దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ సూచనల కోసం నిర్ధారణ పేజీ ప్రింట్ తీసుకోవాలి.