స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు IIT లో అడ్మిషన్ : IIT లో అడ్మిషన్ కావాలంటే JEE లో అద్భుతమైన ప్రదర్శన చేయాల్సి ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే, ఒకసారి IIT లో అడ్మిషన్ సాధించిన తర్వాత చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారనే విషయం అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఎక్కువమంది విద్యార్థులు విటమిన్ డి లోపంతో బాధ పడుతున్నారనే విషయం అధికారుల దృష్టికి వచ్చింది. విద్యార్థులు ఎక్కువ కాలం పుస్తకాలకు పరిమితమవ్వడమే దీనికి కారణమని అధికారులు గ్రహించారు, విద్యార్థులకు మానసిక ఉల్లాసం మరియు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని IIT మద్రాస్ క్యాంపస్ లో 25 కోట్ల రూపాయలతో క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు. అంతే కాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా క్రీడల కోటాలో అడ్మిషన్ అందించిన మొదటి IITగా నిలిచింది. ఈ విద్యా సంవత్సరానికి కూడా స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్ ఇవ్వనున్నారు.
IIT మద్రాస్ స్పోర్ట్స్ కోటా సీట్ల సంఖ్య ( Number of Sports Quota Seats in IIT Madras)
ఐఐటీ మద్రాస్ సంస్థ స్పోర్ట్స్ కోటాలో అందిస్తున్న సీట్ల వివరాలు ఇక్కడ చూడవచ్చు.
IIT మద్రాస్ స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్ అందించే ప్రోగ్రాం కి స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్ (SEA) అనే పేరు పెట్టింది. ఇప్పటికే ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు అడ్మిషన్ కూడా లభించింది.